Mopadu Reservoir Water Released to Nellore District : మోపాడు జలాశయ పరిధిలోని జిల్లా ఆయకట్టును విస్మరించి నెల్లూరు జిల్లాకు నీటిని విడుదల చేయడంపై ప్రకాశం రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పామూరు మండలం మోపాడు జలాశయం నుంచి నీటిని అధికారులు ఆక్రమంగా వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోపాడు రిజర్యాయర్పై నీటిని వృధాగా వదలడంపై డీఈ, ఏఈలపై రైతులు మండిపడ్డారు. వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు అధికారులు బుధవారం జలాశయం నుంచి పెద్ద మొత్తంలో నీటిని వదిలేశారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మోపాడు, రేగిచెట్టపల్లి, లక్ష్మీ నరసాపురం, కొర్రలపాడు, కట్టకింద పల్లి, కొండారెడ్డి పల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు మోపాడు జలాశయం వద్దకు చేరుకున్నారు.
జగన్ కలలు కంటున్నారు - వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం: అమరావతి రైతులు
Prakasam Farmers Protest : జిల్లాల్లో ఆయకట్టు కింద పలు గ్రామాల్లో నాలుగు వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని, సంక్రాంతి తర్వాత కూడా ఆలస్యంగా పంట వేశామని వారు రైతులు వాపోయారు. ప్రస్తుతం జలాశయంలో పది అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు తమకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాల ఆయకట్టుకు అన్యాయం చేసి నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తొట్టిపల్లి గ్రామంలో వంద ఎకరాలకు నీళ్లు ఎలా వదులుతారని ప్రశ్నిస్తున్నారు.
నీరిస్తామన్నారని వరి వేసిన అన్నదాతలు- పంట కోతకొచ్చే వేళ చేతులెత్తిన అధికారులు
వైసీపీ నాయకుల ఆదేశాల మేరకు అధికారులు అర్ధరాత్రి సమయంలో నీటిని గుట్టు కాకుండా వృథాగా కిందకు ఎలా వదిలేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్యాయర్లోని చేపల కోసం నీళ్లను వృథాగా వదిలేస్తే పంటలను ఎలా పండించుకోవాలంటూ అధికారులను నిలదీశారు. అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలే కానీ నాయకుల చెప్పినట్లు వ్యవహరించడం ఏ మాత్రం సమంజసంగా లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని వృథాగా పోతున్న నీటిని నిలుపుదల చేసి రైతన్నలకు రిజర్వాయర్లోని నీటిని రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.
అమరావతి భ్రమరావతి అనే జగన్- సచివాలయాన్ని ఎలా తాకట్టు పెట్టారు- రాజధాని రైతుల ఆగ్రహం