ETV Bharat / state

సచివాలయానికి చేరిన కూటమి నేతల ఫ్లైయాష్ వివాదం - సీఎం ఏమన్నారంటే?

సచివాలయానికి ఆర్టీపీపీ ఫ్లైయాష్ వివాదం - సీఎం ఆదేశంతో సచివాలయానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

rtpp_flyash_issue
rtpp_flyash_issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Updated : 53 minutes ago

MLA Adinarayana meet CM Chandrababu: వైఎస్సార్​ జిల్లాలోని రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్(Rayalaseema Thermal Power Plant) ఫ్లైయాష్‌ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. జ్వరం వల్ల రాలేనని జేసీ ప్రభాకర్‌రెడ్డి సమాచారం అందించారు. ఫ్లైయాష్‌ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదం కారణంగా కూటమి ప్రతిష్ట దెబ్బతింటుందని ఇప్పటికే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయానికి చేరిన కూటమి నేతల ఫ్లైయాష్ వివాదం - సీఎం ఏమన్నారంటే? (ETV Bharat)

స్థానికులకు ఉపాధి కలిగించేందుకే తీసుకెళ్తున్నాము: ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లైయాష్ ఉచితమని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి(MLA Adinarayana Reddy) అన్నారు. స్థానికులకు ఉపాధి కలిగించేందుకు ఈ బూడిదను తీసుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) మాత్రం పెద్ద లేఖ రాశారని, లెటర్ రాసిన వారు స్వయంగా రావాలి కదా అని అన్నారు. స్ధానికుల తరవాతే ఇతరులకు ఇవ్వాలని సీఎం కు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డి వెల్లడించారు. పోలీసు, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదాన్ని సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు.

అసలేం జరిగిందంటే: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు, తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పెద్దారెడ్డి సిమెంటు పరిశ్రమలకు సరఫరా చేసేవారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి పురపాలక సంఘం ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బూడిద తోలుకోవడం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరింది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంటు పరిశ్రమలకు వెళ్లనివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.

లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవ్వరినీ ఉపేక్షించను - 'బూడిద' గొడవపై చంద్రబాబు అసహనం

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​

Last Updated : 53 minutes ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.