ETV Bharat / state

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన - ఆహారం అందుతుందా? లేదా? అని ఆరా - Ministers Visit Flooded Areas

Ministers Visiting Flood Affected Areas in AP : వరద ముంపు ప్రాంతాల్లో రేయింబవళ్లనే తేడా లేకుండా సహాయక చర్యల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. ప్రజల పరిస్థితులపై ఎప్పటికప్పడు ఆరా తీస్తున్నారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు.

MINISTERS VISIT FLOODED AREAS
MINISTERS VISIT FLOODED AREAS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 8:19 AM IST

Ministers Visiting Flood Affected Areas in AP : వరద బీభత్సం సృష్టించిన విజయవాడలోని పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. సహాయక చర్యలపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆహారం అందిందా లేదా అని ఆరా తీస్తున్నారు. ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాకూడదని అధికారులకు తెలిపారు.

వరద సహాయ చర్యలపై మంత్రి లోకేశ్​ సమీక్ష : వరద సహాయ చర్యలపై మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, సీఎస్​ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌తో లోకేశ్​ సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మనుషులు వెళ్లలేని చోటుకి డ్రోన్ల ద్వారా ఆహారం అందిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు.

ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా దాదాపు 30 నుంచి 40 డ్రోన్లు వినియోగించి మనుఘలు వెళ్లలేని చోటుకి బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నాం.55 టన్నుల ఆహారపదార్థులు, తాగునీరును 6 హెలికాప్టర్లు ద్వారా బాధితులకు చేరవేస్తున్నాం- మంత్రి పార్థసారథి

ఎవరూ భయపడొద్దు - అన్ని విధాలా ఆదుకుంటాం: ప్రజలకు మంత్రుల భరోసా - Ministers Visit Flooded Areas

ప్రజల యోగక్షేమాలపై మంత్రి ఆరా : విజయవాడలోని వరద ప్రాంతాల్లో మంత్రి సవిత పర్యటించారు. విపత్తు నిర్వహణ శాఖ సిబ్బందితో కలిసి వరద నీటిలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఆహారం, తాగునీరు అందించారు. విజయవాడలోని వరద బాధితులకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ ఆహారం పంపిణీ చేశారు. పడవలో తిరుగుతూ 11 వేల భోజన ప్యాకెట్లు, 50 వేల వాటర్‌ బాటిళ్లు అందజేశారు. కృష్ణలంక, రాణీగారి తోటలోని వరద బాధితులకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో స్థానిక నాయకుల ఆహారం అందించారు.

వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా - MINISTERs REVIEW ON FLOODS

మంత్రి డోలా పర్యటన : ఎన్టీఆర్​ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, కొండపల్లిలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో మాట్లాడి అహారం, తాగునీరు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆహారం, తాగునీరు అందలేదని ఏ ఒక్కరి నుంచి ఫిర్యాదు రాకూడదని అధికారులకు తెలిపారు.

అత్యవసరమైతేనే బయటకు రండి - ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు సూచనలు - Heavy Rains in aP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.