ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం - ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు - Vana Mahotsavam Program

Ministers and MLAs Participated in Vana Mahotsavam Program: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో పార్కులు, గ్రీనరీ అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు.

vana_mahotsavam_program
vana_mahotsavam_program (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 9:42 PM IST

రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం - ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు (ETV Bharat)

Ministers and MLAs Participated in Vana Mahotsavam Program: ఐదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో చెట్లను నరకడమే తప్ప నాటడం చూడని రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రమాణం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Shri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. శివారులోని నగరవనంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. నాటిన మొక్కలను సంరక్షించుకునేందుకు ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ అన్నారు. నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. నెల్లూరులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్కులు, గ్రీనరీ అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నారాయణ తెలిపారు.

Vijayawada: విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ సృజన పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. విజయవాడలోని ఫిల్మ్ కాలనీలో నిర్వహించిన వన మహోత్సవంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పాల్గొన్నారు. మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు.

విజయవాడ సీపీ కార్యాలయానికి బాలీవుడ్‌ నటి - వేధింపులపై ఫిర్యాదు - Mumbai Actress Complaint to Police

Visakhapatnam: విశాఖ జీవీఎంసీ పరిధిలోని ఎంవీడీఎం ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ మొక్క నాటారు. విశాఖను గ్రీన్‌ సిటీగా చేసి కాలుష్యం నుంచి ప్రజలను రక్షిస్తామని వంశీకృష్ణ యాదవ్‌ అన్నారు.

Srikakulam: శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. నిరంతర కార్యక్రమంగా మొక్కలు నాటాలన్న అచ్చెన్నాయుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.

Vizianagaram: విజయనగరం జిల్లా డెంకాడ మండలం బేతనాపల్లి నగరవనంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు.

అడవిలో అడుగుపెడితే అదే చివరిరోజు - ఎర్ర చందనం స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్ - Vana Mahotsava Program in AP

ఐదుగురు అల్లిన 'ప్రేమ'కథా చిత్రమ్ - 'హిడెన్ కెమెరాల' వ్యవహారంలో క్రేజీ ట్విస్ట్ - నిజం తేల్చిన పోలీసులు - HIDEN CEMERA STORY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.