ETV Bharat / state

వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి : శ్రీధర్ బాబు

Minister Sridhar babu On AI Health : కృత్రిమ మేథను ఉపయోగించి ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆరోగ్య వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోందని తెలిపారు. హైటెక్ సిటీలోని ఐటీ కారిడార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రావిడెన్స్ కార్యాలయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

Providence global healthcare
Minister Sridhar babu On AI Health
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 5:12 PM IST

Minister Sridhar Babu On AI Health : కృత్రిమ మేథను ఉపయోగించి ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆరోగ్య వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోందని కృత్రిమ మేథ సాయంతో అన్ని వివరాలను పొందుపరుస్తామని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్జానం ఉపయోగించి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని చెప్పారు.

హెల్త్ ఫ్రొఫైల్ సేకరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సులభంగా చికిత్స అందించే అవకాశం ఉంటుందని శ్రీధర్ బాబు అన్నారు. హైటెక్ సిటీలోని ఐటీ కారిడార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రావిడెన్స్ కార్యాలయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అమెరికాకు చెందిన ప్రావిడెన్స్ కంపెనీ ఆరోగ్య రంగంలో సాంకేతిక సేవలందిస్తోంది. రాబోయే రోజుల్లో సేవలు మరింత విస్తరిస్తామని ప్రావిడెన్స్ చీఫ్ గ్లోబల్ ఆఫీసర్ మురళీ కృష్ణ తెలిపారు.

ప్రభుత్వ పథకాలను చూసి ఓర్వలేకే బీఆర్​ఎస్​ నాయకుల అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్​ బాబు

"ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రంగంలో సాంకేతిక సేవలు అందిస్తున్న ప్రావిడెన్స్ హైదరాబాద్​లో కార్యాలయం ప్రారంభించడం అభినందనీయం. కృత్రిమ మేథతో అత్యవసర చికిత్స విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గత రెండు దశాబ్దాలుగా ఫార్మా రంగంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో ముందంజంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఎన్నో పేరు ప్రఖ్యాతలు సాధించింది. సాంకేతిక పరిజ్జానం ఉపయోగించి వైద్య ఆరోగ్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. రేపటి నుంచి హెచ్ఐసీసీలో బయో ఆసియా సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో ప్రపంచ కంపెనీల సీఈవోలు పాల్గొంటారు." -శ్రీధర్ బాబు, మంత్రి

వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి : శ్రీధర్ బాబు

శిశు విహార్​లో​ నూతన భవనం - ప్రారంభించిన సీతక్క

సమస్యల పుట్టలా ఆ మాతాశిశు ఆరోగ్య కేంద్రం.. లక్ష్యానికి ఆమడదూరంలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.