ETV Bharat / state

'ప్రజల సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగం కానివ్వం' - Ministers Fires on BRS Party

Minister Ponguleti Review Meeting on Warangal Development : ఉమ్మడి వరంగల్ జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మేడారం మహా జాతర ఏర్పాట్లకోసం మరో 30 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా పనులు చేపట్టింది తప్ప, వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను వెలికితీస్తామని, ప్రజల సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కబ్జాకు గురైన గజం భూమినీ వదులుకునే ప్రసక్తి లేదని వరంగల్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు.

Minister Surekha Fires on BRS Party
Minister Ponguleti Review Meeting on Warangal Development
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 10:21 PM IST

Minister Ponguleti Review Meeting on Warangal Development : హనుమకొండ కలెక్టరేట్​లోని కాన్ఫెరెన్స్ హాల్​లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasareddy) సమీక్షించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క(Seetakka), పొన్నం ప్రభాకర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

అంతా ఖాళీ చేసి ఇచ్చారు - ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు : సీతక్క

వేసవికాలంలో తాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మేడారం జాతరను(Medaram Jatara) విజయవంతం చేసేందుకు అధికారుల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలంటూ జాతర కోసం, మరో 30 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ ప్రజల అభిప్రాయలకు అనుగుణంగా ఉంటుందని తెలిపారు.

ఉచిత విద్యుత్ స్కీంపై తగ్గేదేలే : అభయహస్తం కింద ప్రజలిచ్చిన దరఖాస్తులను 95 శాతం కంప్యూటరీకరించామని తెలిపారు. గత ప్రభుత్వం మెప్పు కోసం ఆర్భాటంగా పనులు మొదలుపెట్టి పూర్తి చేయలేదని మంత్రి పొంగులేటి విమర్శించారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను బయటకు తీస్తామని, ఒక్క గజం ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కావివ్వబోమని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా అందించడం పట్ల వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పొంగులేటి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్​ను​ 100 మీటర్ల బొంద తీసి పాతిపెడతా - సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

గత ప్రభుత్వంలో ఏవైతే కొన్ని ఆర్భాటంగా ప్రాజెక్టులు చేపట్టారో, కొన్ని జీవోలు ఇచ్చారో , ఆ చెప్పిన వాగ్ధానాలు ఎంత వరకు పనులు జరిగాయన్న అంశాలపై సమీక్షించాం. అదేవిధంగా పెండింగ్​లో ఉన్న పనులు ఏవిధంగా పూర్తి చేయాలన్న దానిపై, వరంగల్​లోని 12 నియోజకవర్గాల్లోనూ చర్చించాం. ఇరిగేషన్​తో పాటుగా నాటి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్ రూం స్కీంపై శ్రద్ధ వహిస్తాం. అలానే చాలా శాఖల్లో వేలాది కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. వాటి పరిష్కార మార్గం ఎలా అన్నదానిపై ఆలోచనలు చేశాం.-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రి

ప్రజల సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యమని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి కొండా సురేఖ(Konda Sureka) అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిందని విమర్శించారు. దొంగే దొంగన్నట్లుగా గులాబీ పార్టీ(BRS Party) నాయకులు వ్యవహరిస్తున్నారని విప్ రామచంద్రు నాయక్ దుయ్యబట్టారు.

ప్రజల సమస్యలను పరిష్కరించే పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీనే. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా భ్రష్టుపట్టించింది. ఇవాళ సమీక్షలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి వారి సమస్యలను చెప్తుంటే, అడ్డగోలుగా చేసిన అవినీతి బయటపడుతుంది.-కొండా సురేఖ, రాష్ట్ర మంత్రి

నియోజకవర్గాల వారీగా ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను శాసనసభ్యులు ప్రస్తావించారు. జిల్లాకు అధిక నిధులు కేటాయించి ఓరుగల్లును అగ్రపథంలో నిలపాలని సమీక్షసమావేశంలో విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వ అవినీతి అక్రమాలను వెలికితీస్తాం - ప్రజల సొమ్ము ఒక్క రూపాయి దుర్వినియోగం కానివ్వం

బీఆర్​ఎస్​ను 100 మీటర్ల లోతులో పాతిపెడతానన్న సీఎం రేవంత్​ రెడ్డి - వెకిలి మాటలెందుకంటూ మాజీ మంత్రి ఆగ్రహం

రుణాల చెల్లింపులకే రూ.16 వేల కోట్లు - నీటి పారుదల ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అవసరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.