Minister Nara Lokesh Released AP Academic Calendar: రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.
టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫొటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్ లెట్స్ నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు.
20లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉన్నాం: లోకేశ్ - LOKESH speech on jobs
సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేశ్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి లోకేశ్, విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా అకడమిక్ క్యాలెండర్ విడుదల గురించి తెలిపారు. "పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదల చేశాను. అనంతరం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉంచాలని స్పష్టం చేశాను. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని సూచించాను. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయించాం. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించాను." అని ట్వీట్ చేశారు.
పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదల చేశాను. అనంతరం ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉంచాలని స్పష్టం చేశాను. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జూలైతో… pic.twitter.com/wL1c6iN8Hz
— Lokesh Nara (@naralokesh) July 29, 2024