The lord venkateswara swamy temple at Tirumala is our most sacred temple. I am shocked to learn that the @ysjagan administration used animal fat instead of ghee in the tirupati Prasadam. Shame on @ysjagan and the @ysrcparty government that couldn’t respect the religious… pic.twitter.com/UDFC2WsoLP
— Lokesh Nara (@naralokesh) September 18, 2024
Minister Nara Lokesh Reaction On Tirumala Laddu Issue : గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రపై పలు ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వినియోగించారని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దీంతో వైఎస్సార్సీపీపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వేంకటేశ్వర స్వామి అన్నదానం, అలాగే శ్రీ వారి లడ్డూ తయారీలో వాడే పదార్థాల నాణ్యత విషయం రాజీపడేదే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే టీటీడీ ఈవో తెలిపారు.
మంత్రి నారా లోకేష్ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు వాడారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం మా అత్యంత పవిత్రమైన ఆలయం. వైఎస్సార్సీపీ నేతల హయాంలో తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ఉపయోగించారని తెలిసింది. కోట్లాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవించలేని వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిగ్గుపడాలి’’ అని మంత్రి ట్వీట్ చేశారు.
APCC Chief YS Sharmila Comments On Tirumala Laddu Controversy Over Chandrababu Statemen : లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజానిజాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
'తిరుమల లడ్డూలపై అసత్య ప్రచారం నమ్మొద్దు'- ఇకపై వారికి ఆధార్ ఉంటేనే! - Illegal Laddu Sales in TTD
తిరుమల లడ్డూలపై అధికారులు తెలిపిన విషయాలే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. తిరుమలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు పుట్టలో పాముల్లా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ధ్వజమెత్తారు. సలహాదారులకు మాత్రం పదవీకాలం ముగియకముందే రెన్యువల్ చేసిన జగన్, ఆగస్టు 2023 నుంచి వాలంటీర్లను ఎందుకు రెన్యూవల్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. గత ఐదేళ్లలో సాక్షి పత్రికకు అడ్డగోలుగా ప్రజాధనం దోచి పెట్టాడని ఆరోపించారు.
తిరుపతిలో టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి అనేది వాడారన్నది వాస్తవమని స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రభుత్వ సహకార సంస్థ ద్వారా ఇంతకు ముందు నాణ్యమైన ఆవు నెయ్యి వస్తోందని, మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని తెలిపారు. దిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా టెండర్‌ను అప్పజెప్పారన్నారు. ఈ సంస్థ రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యి సరఫరా చేసిందని ఓవీ తెలిపారు. వైవీ, భూమన, ధర్మారెడ్డి తప్పులకు జగన్ శిక్ష అనుభవిస్తున్నారని ఓవీ రమణ పేర్కొన్నారు.