Minister Nara Lokesh Meeting With Union Home Minister Amit Shah : దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి దిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని, కొన్నింటికి నిధులు కేటాయించాలని కోరారు.
దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని, కొన్నింటికి నిధులు కేటాయించాలని లోకేశ్ కోరారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ సాయం అందించి సహకరించాలని కోరారు.
Central Funds To Andhra Pradesh : కూటమి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను వివరించారు. 40 నిమిషాలపాటు జరిగిన భేటీలో రాష్ట్రంలోని వర్తమాన పరిస్థితులు, రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను అమిత్‌షాకు లోకేశ్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చినట్లు తెలిసింది.
'వైఎస్సార్సీపీ పునాదులే నేరాలు - ఘోరాలు' - ఎక్స్‌లో నారా లోకేశ్ V/S వైఎస్ జగన్
అనంతరం శ్రీవారి ప్రతిమను అమిత్ షాకు ఇచ్చిన లోకేశ్ వినతులపై సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి కేంద్ర హోంమంత్రికి వివరించినట్లు మంత్రి లోకేశ్ ఎక్స్‌లో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ ఆర్థికశక్తి కేంద్రంగా తీర్చిదిద్దడానికి, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన పలికిన మద్దతుకు తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి నిరంతరం ఆయన అందిస్తున్న మార్గదర్శనానికి ధన్యవాదాలని లోకేశ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎలక్ట్రానిక్స్ తయారీదారులతో సమావేశం కానున్నట్లు సమాచారం.
తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు - జగన్‌కు మంత్రి లోకేశ్ హెచ్చరిక