Dear @NASSCOM members,
— Lokesh Nara (@naralokesh) July 17, 2024
We understand your disappointment. We welcome you to expand or relocate your businesses to our IT, IT services, AI and data center cluster at Vizag.
We will offer you best-in-class facilities, uninterrupted power, infrastructure and the most suitable… https://t.co/x2N0CTbnfp
Minister Nara Lokesh Invited NASSCOM: రాష్ట్రంలో ఐటీ సేవల విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయంటూ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికారు. కర్నాటక ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అనే చట్టంపై జరుగుతున్న వివాదాన్ని ఉద్దేశించి ఎక్స్‌లో ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కర్నాటకలో తెచ్చిన కొత్త చట్టంపై పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, నాస్కామ్ (National Association of Software and Service Companies) వంటి సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
దేశ వ్యాప్తంగా కర్నాటక చట్టంపై చర్చ మొదలైన తరుణంలో ఆ పరిణామాలను అనుకూలంగా మార్చుకుంటూ నాస్కామ్‌కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని లోకేశ్ ప్రతిపాదనలు పంపారు. కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024 పరిశ్రమల బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు లోకేశ్ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను పంచుకున్నారు.
పెట్టుబడిదారుల ఆవేదన, అభ్యంతరాలు తాను అర్థం చేసుకున్నానని, ఏపీలో ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు ఉండవని, పెట్టుబడులు పెట్టొచ్చంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఏపీలో ఐటీ, ఐటీ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ క్లస్టర్‌కి, వ్యాపారాలకు విశాఖ అనకూలంగా ఉంటుందని తెలిపారు. తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసుకోవటం లేదా విస్తరించుకోవచ్చని సూచించారు.
ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు, నిరంతర విద్యుత్, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు పెట్టదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. నిపుణులైన యువత, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానం పలికారు.
మంత్రి లోకేశ్ చొరవ - కువైట్ నుంచి స్వస్థలానికి చేరుకున్న శివ - TELUGU WORKER SHIVA COME TO AP
ఇంజినీరింగ్ విద్యార్థులకు లోకేశ్ అభినందనలు: శ్రీకాకుళం అంబేడ్కర్ వర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనల తెలిపారు. అంబేడ్కర్ వర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థులు తక్కువ ఖర్చుతో రాకెట్ రూపొందించి అద్భుత ప్రతిభ కనబరిచారు. తక్కువ ఖర్చుతో రీ ల్యాండింగ్ రాకెట్ రూపొందించినందుకు అభినందనలు తెలిపిన లోకేశ్ , విద్యార్థులకు తోడ్పాటునిస్తామని హామీ ఇచ్చారు.