ETV Bharat / state

మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా? - కేటీఆర్, హరీశ్​రాలకు కోమటిరెడ్డి సవాల్ - Musi River Development Project - MUSI RIVER DEVELOPMENT PROJECT

Musi River Development Project : మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలను తరలించి, మూసీని శుద్ధిచేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే తాము ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువన్న ఆయన, మూసీలో పారేది విషపు నీళ్లని తెలిసి కూడా దానిని అడ్డుకోనీకుండా ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు.

Minister Komati Reddy slams BRS
Musi River Development Project (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 3:57 PM IST

Updated : Oct 1, 2024, 5:17 PM IST

Minister Komati Reddy slams BRS : మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే, ఎందుకు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. మూసీ అభివృద్ధిని అడ్డుకుంటే తాము ప్రత్యక్ష ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మూసీ వల్ల కలిగే ఇబ్బంది తెలిస్తే జర్నలిస్టులు కూడా సహించరన్న ఆయన, మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా అని సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​లకు మానవత్వం లేదని విమర్శించారు. నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువన్న ఆయన, మూసీలో పారేది విషపు నీళ్లని తెలిసి కూడా ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు.

మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా : మూడు నాలుగు కోట్లు పెట్టి విల్లా కొనుకున్న వాళ్లు అయినా, గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లయినా మూసీ పక్కన ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారన్నారు. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం చెల్లడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్, కేటీఆర్ తమ ఊరిలో బస చేయాలని, అక్కడ కనీసం టిఫిన్ కూడా చేయలేమని ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ డెవలప్​మెంట్ బోర్డు అన్నారు కదా ఏమైందని ప్రశ్నించారు. మూసీ పరిస్థితి ఎలా ఉందో గత సీఎం కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పని చేసిన ప్రియాంక వర్గీస్​ను అడిగితే తెలుస్తుందన్నారు.

మూసీ మురికితో ఇబ్బందులు : మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారని నిలదీశారు. తాను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నానన్న వెంకటరెడ్డి మమ్మల్ని సావమంటావా? అని ప్రశ్నించారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి, తాము మూసీ మురికితో చావాలా అని నిలదీశారు. హరీశ్ రావో, అగ్గిపెట్టె రావో వెళ్లి మూసీ దగ్గర ఉంటే రోగాలు వస్తాయని చెప్పాలని సూచించారు. ఎంత ఖర్చయినా పెట్టి మూసీని ప్రక్షాళన చేయాలని సీఎంకి చెప్పినట్లు తెలిపారు. డీపీఆర్ రెడీ కాకుండా అవినీతి ఎక్కడ అవుతుంది? కేటీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.

వద్దని చెబుతున్నా - వారంతా నన్ను సార్​ అని పిలుస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి

ఆరేళ్లలో 6 కి.మీ. వంతెన పూర్తి చేయలేకపోవటం సిగ్గుచేటు : మంత్రి కోమటిరెడ్డి - Minister Komatireddy Uppal Flyover

Last Updated : Oct 1, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.