ETV Bharat / state

సాగర తీరంలో సందడిగా మిలన్​ 2024 - అబ్బురపరుస్తున్న నేవీ విన్యాసాలు

Milan 2024 in Visakha: విశాఖ తీరంలో మిలన్​ 2024 విన్యాసాల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి నేవీ బృందాలు, ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు విశాఖ సాగర తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 22న జరగనున్న సిటీ పరేడ్​ ప్రజలను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది.

milan_2024_in_visakha
milan_2024_in_visakha
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 7:52 AM IST

సాగర తీరంలో సందడిగా మారిన మిలన్​ 2024 - అబ్బురపరుస్తున్న నేవీ బృందాల విన్యాసాలు

Milan 2024 in Visakha: విశాఖ తీరంలో మిలన్ 2024 విన్యాసాల సందడి మొదలైంది. ఈ విన్యాసాల్లో దాదాపు 50 దేశాలు పాల్గొంటుండగా, ఇప్పటికే పలు దేశాల నేవీ బృందాలు సాగర నగరానికి చేరుకున్నాయి. వివిధ దేశాల యుద్ధ నౌకలు, హెలీకాప్టర్లు, విమానాలు, విన్యాసాలకు రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈనెల 22న జరగనున్న సిటీ పరేడ్ నగరవాసులకు కనువిందు చేయనుంది.

విశాఖలో జరిగే మిలన్ 2024 నౌకాదళ విన్యాసాల్లో వివిధ దేశాల ప్రతినిధులు నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వచ్చేశారు. తొలిదశ హార్బర్ దశ 19 నుంచి 23 వరకు, సముద్రపు దశ 24 నుంచి 27 వరకు నిర్వహిస్తున్నారు. 22న మిలన్ 2024 సిటీ పరేడ్‌లో వివిధ దేశాల నౌకాదళ బృందాలు పాల్గొంటున్నాయి.

విశాఖ వేదికగా 'నేవీ మిలన్-2024'- నౌకాదళ ఉత్సవాల్లో పాల్గొనున్న 50 దేశాలు

గత రెండు రోజులుగా ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ను పెద్ద సంఖ్యలో నగర వాసులు వీక్షిస్తున్నారు. విశాఖ చేరుకున్న భారత్ నౌకాదళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కారియర్లు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విరాట్ ఈ రెండు యుద్ధ నౌకలు మిలన్ 2024లో ప్రధాన అకర్షణగా ఉన్నాయి. వీటితోపాటుగా దాదాపు 20 యుద్ధ నౌకలు, ఎంఐజీ 29K మరియు పీ8I సహా దాదాపు 50 విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొని తమ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి. విన్యాసాలు గగన తలంలో చూపరులకు గగుర్పాటు కలిగించేలా సాగనున్నాయి.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ క్రాప్టు కారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, హిందూ మహాసముద్రంలో దేశ సముద్ర రక్షణ, పవర్ ప్రొజెక్షన్ సామర్థ్యాలు, పోరాట పటిమకు నిదర్శనమైన విక్రమాదిత్య విన్యాసాల్లో పాల్గొంటాయి. వీటితో పాటు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్ విక్రాంత్, వివిధ దేశాల నౌకలు దాదాపు పదివరకు ఇప్పటికే విశాఖ తీరానికి చేరాయి.

ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు... అబ్బురపరిచే ప్రదర్శనలు

మిలన్ నిర్వహించడం ఇది 12వ సారి. సముద్ర దశలో, పాల్గొనే నౌకాదళాలు అధునాతన ఎయిర్ డిఫెన్స్, యాంటీ సబ్‌మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్‌ఫేర్ డ్రిల్‌లను నిర్వహిస్తాయి. వైమానిక, ఉపరితల లక్ష్యాలపై గన్నేరీ షూట్‌లు, విన్యాసాలు కొనసాగుతాయి. సముద్రాలపై భద్రతను పెంపొందించడానికి, అందరి వృద్ధి శ్రేయస్సు కోసం సముద్ర వాణిజ్య భద్రతను నిర్ధారించడానికి ఆలోచనలను పంచుకోవడానికి పాల్గొనే నావికాదళాలకు మిలాన్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.

వంజంగి కొండపై పర్యాటకుల సందడి - కనీస సౌకర్యాలు లేవని ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.