ETV Bharat / state

కీర్తిచక్ర మేజర్‌ రాంగోపాల్‌ నాయుడు-గ్రెనేడ్​కు బెదరలేదు- తోటి సైనికులను రక్షించాడు - Kirti Chakra to Srikakulam major

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 4:20 PM IST

Major MR Gopal Naidu From Srikakulam District Awarded Kirti Chakra : దేశంలోనే ప్రతిష్టాత్మక కీర్తిచక్ర పురస్కారం మెుట్టమెుదటిసారి తెలుగు వ్యక్తికి లభించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లా రాంగోపాల్‌ నాయుడును కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. తాను చూపిన అసమాన ధైర్య సాహసాలకు గానూ ఈ పురస్కారం రాంగోపాల్​ను వరించింది. ఇంతకీ మేజర్​ ఏం చేశాడో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

major_mr_gopal_naidu_from_srikakulam_district_awarded_kirti_chakra
major_mr_gopal_naidu_from_srikakulam_district_awarded_kirti_chakra (ETV Bharat)

Major MR Gopal Naidu From Srikakulam District Awarded Kirti Chakra : జమ్ముకశ్మీర్‌ నియంత్రణ రేఖ వద్ద జరిగిన పోరులో ఉగ్రవాదులను మట్టుబెట్టి, తన తోటి సైనికుల్ని రక్షించుకోవటంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు ఈ మేజర్​. అందుకు గానూ అతను అరుదైన అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15న ఈ పురస్కారాలు ప్రకటించగా త్వరలో రాష్ట్రపతి చేతుల మీదుగా రాంగోపాల్‌ నాయుడు ఈ కీర్తిచక్ర అవార్డు అందుకోనున్నారు.

మేజర్ రాంగోపాల్ వ్యూహాత్మక ఆలోచన, ధైర్యసాహసాలతో దళాలను కాపాడుకోవడంలో చేసిన కృషికి గాను ఆయన్ను అర్మీ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మక శౌర్యపతకాల్లో రెండోదైన కీర్తిచక్రకు ఎంపిక చేశారు. 2023 అక్టోబరు 26 ఉదయం 10గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఐదుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారన్న సమాచారంతో ఆర్మీ మేజర్ రాంగోపాల్ నాయుడు నేతృత్వంలో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు మెరుపు వేగంతో రంగంలోకి దిగారు. కుప్వారాలో మాటువేసి ఐదుగురు ఉగ్రవాదులపై విరుచుకుపడ్డారు.

కాల్పులు, ఎదురు కాల్పులతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. ఓ ఉగ్రవాది గుహలో నక్కి భారత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించారు. ముష్కరులు భారత సైన్యంపై గ్రెనేడ్‌ విసరడాన్ని గమనించిన మేజర్‌ రామ్‌గోపాల్‌ నాయుడు ప్రాణాలు లెక్కచేయకుండా, రెప్పపాటుకాలంలో పెను ప్రమాదం నుంచి సైన్యాన్ని కాపాడి. అనంతరం ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఇద్దరు ఉగ్రవాదులను నేరుగా హతమార్చి భారత జవాన్లను రక్షించుకోవడంలో అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు కేంద్రం ఆయన్ను కీర్తిచక్ర పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారానికి ఎంపికైన నలుగురిలో రామ్ గోపాల్ ఒక్కరే సజీవంగా ఉన్నారు.

సిక్కోలు వీరుడికి కీర్తిచక్ర - రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం

'రక్షణ దళాల్లో చేరి దేశానికి సేవచేయాలని చిన్నప్పటి నుంచే తపించేవాడు రాంగోపాల్ నాయుడు. భారత సైన్యంలో చేరడానికి విజయనగరం జిల్లా కోరుకొండలోని సైనిక పాఠశాల వేదికగా మారింది. ఎంతో కష్టపడి,కఠోర పైన శిక్షణ పరీక్ష అనంతరం మా కొడుకు ఈ స్థాయికి వచ్చాడు. బాల్యం నుంచి రాంగోపాల్​ ఎంతో ధైర్యంగా ఉండేవాడు. మా కొడుకు చేసిన సాహసానికి ఈ అవార్డు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.' - మేజర్ రాంగోపాల్ తల్లిదండ్రులు

రైతు కుటుంబం నుంచి రణరంగం దాకా వెళ్లిన రాంగోపాల్‌ నాయుడుకు పురస్కారం దక్కడంపై గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాంగోపాల్‌ ధైర్యసాహసాలతో మారుమూల గ్రామానికి ఎంతోపేరు తీసుకొచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు.

దేశ రక్షణలో అంకితభావం చాటిన ధీరులకు పురస్కారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.