ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి అనూహ్య స్పందన - సగటున 29.67 లక్షల మంది ప్రయాణం - Mahalakshmi Scheme In Telangana

Mahalakshmi Scheme In Telangana: ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మహిళలు భారీ సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 14 లక్షల మంది ప్రయాణిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 29.67 లక్షలకు చేరుకుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు 1,777 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది.

Mahalakshmi Scheme In Telangana
Huge Response For Mahalakshmi Scheme
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 10, 2024, 12:06 PM IST

Mahalakshmi Scheme In Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం మహాలక్ష్మి. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యంతో ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన మహాలక్ష్మి - మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పథకం ప్రారంభమైన తొలి రోజుల్లో రోజుకు సగటున 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేవారు.

ఉచిత ప్రయాణానికి మహిళలకు కీలక సూచన- ఆ కార్డు చెల్లదంటూ స్పష్టం చేసిన సజ్జనార్

Huge Response For Mahalakshmi Scheme : ఆ తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం సగటున రోజుకు 29.67 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. డిసెంబర్ మాసంలో సగటున 26.99 లక్షల మంది, జనవరిలో సగటున 28.10 లక్షలు, ఫిబ్రవరిలో సగటున 30.56 లక్షలు, మార్చిలో సగటున 31.42 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఏప్రిల్ 7వ తేదీ వరకు రూ. 1,177 కోట్ల విలువైన జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

మహిళలకు రూ.1,500 ఆదా : మహాలక్ష్మి పథకంతో రూ. 1,177 కోట్ల వరకు మహిళలు ఆదా చేశారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 6 లక్షల మంది మహిళలు ప్రతిరోజు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్నారని ఆర్టీసి వెల్లడించింది. గతంలో సిటీలో బస్ పాస్​లు, బస్సు ఛార్జీలకు ఒక్కో మహిళా సుమారు రూ.1,500 వరకు ఖర్చు చేసేవారని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో ఆ డబ్బులు ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయని మహిళలు అంటున్నారు. ఇంట్లో ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నామని తెలిపారు.

ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరి : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం వినియోగించుకోవాలంటే ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. గుర్తింపు కార్డులో సదరు మహిళ ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలన్నారు. ఒరిజినల్‌ గుర్తింపు కార్డు లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌ తీసుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌ తీసుకుని సహకరించాలని సజ్జనార్​ తెలిపారు.

ఫ్రీ బస్ ఎఫెక్ట్ ​- సీటు కోసం చెప్పులతో కొట్టుకున్న మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.