ETV Bharat / state

పెళ్లి ఫ్లెక్సీలు వేయిస్తున్నారా? - ఊహించని అతిథులతో ఇల్లు గుల్ల! - పెళ్లిలో మధ్యప్రదేశ్ గ్యాంగ్

వివాహ వేడుకల్లోకి అతిథులుగా వచ్చి దొరికిందంతా దోచుకెళ్లే ముఠా మధ్యప్రదేశ్ అరెస్ట్ - పెళ్లి వేడుకల్లో దొంగతనాలు చేస్తూ దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న గ్యాంగ్

Madhya Pradesh Wedding Thieves Gang Arrest
Madhya Pradesh Wedding Thieves Gang Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2024, 5:12 PM IST

Madhya Pradesh Wedding Thieves Gang Arrest : పెద్ద పెద్ద పెళ్లి వేడుకల్లోకి అతిధులుగా వెళ్తారు. ప్రతి ఒక్కరితో కలిసి సరదాగా మాట్లాడుతున్నట్లు చేసి దొరికిందంతా దోచుకొని వెళ్తారు. వివాహ వేడుకల్లో దొంగతనాలు చేస్తూ దేశ వ్యాప్తంగా హడలెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లాకు చెందిన ముఠాను తెలంగాణలోని ఆదిభట్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

18 తులాల బంగారం చోరీ : మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లా బోడా ఠాణా పరిధిలోని గుల్ఖేడీ, హల్ఖేడీ, కడియా సాన్సీ గ్రామాల్లో మెజార్టీ ప్రజల ప్రధాన వృత్తి దొంగతనాలు చేయడం చేసి జీవనం సాగించడం. చిన్నారుల్లో దొంగతనాల నైపుణ్యం పెంచేందుకు అక్కడి ముఠాలు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ 3 గ్రామాల్లోనే సుమారు 1200 మంది నేరస్థులు ఉంటారని పేర్కొన్నారు.

గుల్ఖేడీ గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అరుడ(38), అభిషేక్‌(25), అన్నాదమ్ములైన రిషి(19) ఈ ముగ్గురూ వేరు వేరు ప్రాంతాల్లో చిన్నపాటి దొంగతనాలు చేసేవారు. దీంతో చిన్న చిన్న చోరీలు కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఇందుకు అరుడ తన సోదరుడి 12 ఏళ్ల కుమారుడిని ఎన్నుకున్నారు. ధనవంతుల పెళ్లిలు ఆడంబరంగా జరుగుతాయని, వివాహాలకు వచ్చే వారి బ్యాగులు కొట్టేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని పథకం రచించారు. హైదరాబాద్ నగర శివార్లలోని రిసార్టులో ఇలాంటి వివాహాలు జరుగుతాయని తెలుసుకుని సమీప బంధువు దగ్గర కారు అద్దెకు తీసుకుని ఈ నెల 12న వచ్చారు. హైదరాబాద్​లో మకాం వేసి 2 రోజుల పాటు హైదరాబాద్‌-విజయవాడ, సాగర్‌ రహదారిపై కొన్ని ఫంక్షన్‌ హాళ్లలో చోరీకి ప్రయత్నం చేశారు. కానీ విఫలం అయ్యారు.

రెండు మేకలు చోరీ- 'రాజన్​' ఇంటికి నిప్పు- 36 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు - Aurangabad Goat Theft Case

ఈ నెల 14న హైదరాబాద్ శివారులోని ట్రాంక్విల్‌ రిసార్టులో పెళ్లి వేడుక జరుగుతుందని ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూసి సమాచారం తెలుసుకున్నారు. అడ్రస్​ తెలుసుకొని ట్రాంక్విల్‌ రిసార్టుకు చేరుకున్నారు. వివాహ వేడుక జరిగే ప్రాంగణానికి అభిషేక్‌ మినహా మిగిలిన ముగ్గురూ అతిథుల్లా వెళ్లారు. రిషి, అరుడ అంతా గమనిస్తున్నారు. 12 ఏళ్ల బాలుడు అక్కడ చిన్నారులతో ఆడుతూపాడుతూ కలిసిపోయాడు. డబ్బులు, నగలు ఉన్న బ్యాగు కోసం వెతికే క్రమంలో ఓ మహిళ ఫొటో దిగేందుకు 18 తులాల బంగారం ఉన్న బ్యాగును కుర్చీలో పెట్టింది. దీంతో చిన్న పిల్లల్లో కలిసిపోయిన బాలుడు అదను చూసి ఆ బ్యాగును కొట్టేశాడు. బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.

38 తులాల బంగారం, కారు, సెల్‌ఫోన్‌ స్వాధీనం : దీంతో రంగంలోకి దిగిన ఆదిభట్ల పోలీసులు పెళ్లి వేడుకల్లోని సీసీ పుటేజీ ఆధారాలు సేకరించారు. 12 సంవత్సరాల బాలుడు చోరీ చేసే దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇది మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ జిల్లా నేరగాళ్ల పనేనని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లోని ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్‌లోని గుల్ఖేడీ గ్రామానికి చెరుకున్నారు. అక్కడి స్థానిక పోలీసుల సాయంతో బాలుడు, అరుడని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి నుంచి 38 తులాల బంగారం, కారు, సెల్‌ఫోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి ఇస్తారు - ఆపై దొరికినంతా దోచేస్తారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.