Rain Alert in AP : పశ్చిమ మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ - విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు - red alert for north andhra
ఈ క్రమంలోనే విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, ప్రకాశం, పార్వతీపురం మన్యం, చిత్తూరు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 79.25 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఏపీకి రెయిన్ అలర్ట్ - హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ - Rain Alert in AP