Lorry Hit An Army Container In Bapatla District : పేలుడు పదార్థాలతో ఉన్న ఆర్మీ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటన బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామ సమీపంలో నామ్ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి
ఆర్మీ కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర నుంచి ఆర్మీకి సంబంధించిన పేలుడు పదార్థాలతో 18 కంటైనర్లు చెన్నైకి బయలుదేరాయి. బొడ్డువానిపాలెం సమీపంలోని పెట్రోల్ బంకులో ఆయిల్ నింపుకుంటున్న క్రమంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపారు. ఈ సమయంలో బల్లికురవ మండలం కొమ్మలపాడు నుంచి బియ్యం లోడుతో చెన్నై వెళ్తున్న ఓ లారీ ఆగి ఉన్న ఆర్మీ కంటైనర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది.
BMW బైక్, ఆటో ఢీ - హైవేపై రెప్పపాటులో గాల్లో కలిసిన ప్రాణం
దాంతో వెంటనే లారీకి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్పందించిన స్థానికులు ఇళ్లలోని నీళ్లను బకెట్లతో తీసుకువచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారాన్ని తెలుసుకున్న అద్దంకి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గంటకు పైగా కష్టపడి మొత్తానికి డ్రైవర్‌ను బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో అతన్ని ఒంగోలుకు తరలించారు. వాహనానికి 100 మీటర్ల దూరంలో ఎవరినీ ఉంచొద్దని ఆర్మీ అధికారులు సీఐకి తెలియజేశారు. దీనిపై మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.