ETV Bharat / state

ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్​ ఛార్జీలు పెంపు - జగన్ మహానటుడు : నారా లోకేశ్​ - Lokesh Election Campaign - LOKESH ELECTION CAMPAIGN

Lokesh Election Campaign in Tadepalli : ఎన్నిక వేళ ఏపీ రాజకీయ ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రజాగళం పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ప్రజలకు భరోసా అందిస్తోంది. లోకేశ్​, జనసేనాని పవన్​ కల్యాణ్​ పర్యటనలతో ప్రజల మద్దతు పొందుతున్నారు.

lokesh_vist_in_guntur_district
lokesh_vist_in_guntur_district
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 12:33 PM IST

ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్​ ఛార్జీలు పెంపు - జగన్ మహానటుడు : నారా లోకేశ్​

Lokesh Election Campaign in Tadepalli : ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సి వాసులతో నారా లోకేశ్​​ సమావేశం అయ్యారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని నారా లోకేశ్​ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే మైనింగ్ విభాగంపై మొదటి విచారణ కమిటీ వేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని మండిపడ్డారు. ఇంటి పన్ను, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేశ్​ స్పష్టం చేశారు. అక్రమ మధ్య నియంత్రణ పాలసీని తీసుకొస్తామన్నారు. వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామని లోకేశ్​ చెప్పారు.

సీఎం జగన్ (CM Jagan) రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్​తో పాటు భాస్కర్ అవార్డు కూడా వస్తుందని లోకేశ్​ ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపై వేసిన మహానటుడు జగన్​ అని లోకేశ్​ ఆరోపించారు.

నారా లోకేశ్​కు జెడ్​ కేటగిరి భద్రత - కేంద్ర హోం శాఖ నిర్ణయం - Z Category Security to Lokesh

Nara Lokesh Breakfast Meet in Thadepally : తాడేపల్లిలో అపార్ట్​మెంట్​ వాసులతో లోకేశ్​ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లోకేశ్​కు జెడ్ కేటగిరి భద్రత (Z category security) కల్పించిన విషయం తెలిసిందే. లోకేశ్​కు సీఆర్పీఎఫ్ (వీఐపీ వింగ్) బలగాలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించినందున వారు లోకేశ్​కు భద్రతగా వచ్చారు.

టీడీపీలో చేరిన టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ్- ఆహ్వానించిన నారా లోకేశ్ - actor nikhil joined in tdp

Lokesh Easter Wishes to People : ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు టీడీపీ లోకేశ్​ (Lokesh) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన ఏసు క్రీస్తు పునరుత్థాన పవిత్ర దినం క్రైస్తవ లోకానికి పర్వదినమని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభువు చూపించిన ప్రేమ, శాంతి, సహన మార్గంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

రాజకీయం అంటే అధికారం కాదు, ప్రజలకు సేవ చేయడం- టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు - TDP 42nd Foundation Day

42వ వసంతంలోకి టీడీపీ - పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన చంద్రబాబు - TDP Formation Day Celebrations

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.