ETV Bharat / state

రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక - Cheetah in East Godavari - CHEETAH IN EAST GODAVARI

Cheetah in East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. రాజమండ్రి నగర శివారులో చిరుత పులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు జిల్లా ఇంఛార్జి డీఎఫ్​ఓ భరణి తెలిపారు. చిరుతను తిరిగి అడవిలోకి పంపేలా తమ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

LEOPARD SPOTTED ON RAJAHMUNDRY
LEOPARD SPOTTED ON RAJAHMUNDRY (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 7, 2024, 12:07 PM IST

Updated : Sep 7, 2024, 10:48 PM IST

రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక (ETV Bharat)

Cheetah in East Godavari District : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అటవీ ప్రాంత పరిధిలో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతంవైపు చిరుత ఓ నల్లని జంతువుపై దాడి చేసి దివాన్ చెరువు జాతీయ రహదారిపై రోడ్డు దాటడాన్ని వాహనదారులు గమనించారు. చిరుత సంచారంపై స్థానికులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు తెలియజేయగా వారు స్పందించారు.

రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోనే సంచారం: ఈ క్రమంలో జిల్లా ఇంఛార్జ్ డీఎఫ్​ఓ భరణి మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత పులి కదలికలని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. పులి కదలికలు తెలుసుకునేందుకు 36 ట్రాప్ కెమెరాలు అమర్చామని రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్నట్లు రికార్డయ్యాయని తెలిపారు. అత్యధిక జన సంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోనే చిరుత పులి సంచరిస్తోందని తిరిగి అడవిలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామని రెండు బోన్లు కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.

సత్యసాయి జిల్లాలో చిరుత కలకలం - భయాందోళనలో ప్రజలు - Leopard Spotted at Nallacheruvu

నగర శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ, స్వరూప్ నగర్, రూప నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామా నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చురించారు. రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను బయటికి పంపవద్దని పెద్దలు ఆరుబయట కూర్చోవద్దని విజ్ఙప్తి చేశారు. పులి సంచారంపై ఆయా గ్రామాల్లో మైకు ద్వారా ప్రచారం చేస్తున్నట్లు వివరించారు. ఎవరికైనా చిరుత కంటబడితే 18004255909 ఈ టోల్ ఫ్రీ నెంబర్​కు సమాచారం ఇవ్వాలని డీఎఫ్ఓ విజ్ఙప్తి చేశారు.

రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాము. జన సంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోనే చిరుత పులి సంచరిస్తోంది. చిరుతను తిరిగి అడవిలోకి పంపేలా మేము చర్యలు తీసుకుంటున్నాము. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధించేందుకు రెండు బోన్లను అందుబాటులో ఉంచాము. రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను బయటికి పంపించవద్దు.పెద్దలు కూడా ఆరుబయట కూర్చోవద్దు. పులి సంచారంపై మైకు ద్వారా ప్రచారం చేస్తున్నాము.- భరణి, ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో, తూర్పు గోదావరి జిల్లా

శ్రీశైలంలో కుక్కను ఎత్తుకుపోయిన చిరుత - నివాస స్థలాల్లోకి ప్రవేశించడంతో భయాందోళన

నంద్యాలలో మహిళను చంపిన చిరుత బోనుకు చిక్కింది - Leopard Caught in Pacharla

Last Updated : Sep 7, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.