ETV Bharat / state

సరికొత్త డ్రోన్లు ఆవిష్కరించిన 'విజయవాడ' విద్యార్థులు - అమరావతి డ్రోన్ సమ్మిట్​కు సిద్ధం

విజయవాడ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఏఐ సాంకేతికత ఉపయోగించి సరికొత్త డ్రోన్లు తయారుచేశారు.

Amaravati Drone Summit 2024
Amaravati Drone Summit 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 7:21 PM IST

Amaravati Drone Summit 2024 : డ్రోన్ల వినియోగం సర్వసాధారణమైపోయింది. వైద్యం, నిఘా, వ్యవసాయం, ట్రాఫిక్‌, విపత్తు నిర్వహణ. ఇలా విభిన్నరంగాల్లో అదే హవా. వీటి ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించాలని సంకల్పించారు.. విజయవాడ ఇంజినీరింగ్‌ విద్యార్థులు. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన డ్రోన్లు రూపొందించి 'భళా' అనిపించారు. ఏఐ జతచేసి వారు తయారుచేసిన సరికొత్త డ్రోన్లు ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

యువత డ్రోన్ల తయారీలో భాగమవ్వాలని కొన్ని కళాశాలల్లో డ్రోన్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ ప్రోగ్రాంలో భాగంగా ల్యాబ్ అందుబాటులోకి రావడంతో ఇంతవరకూ మార్కెట్లోకి అందుబాటులోకి రాని ఆధునిక డ్రోన్లు రూపకల్పన చేశారీ విద్యార్థులు. పలు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రదర్శించి బహుమతులు, ప్రశంసలూ దక్కించుకున్నారు. విజయవాడ ధనేకుల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్నారు ఈ విద్యార్థులు.

మంగళగిరిలో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిట‌ల్‌గా మార్చాలని నిర్ణయం!

కళాశాలలో డ్రోన్ రీసెర్చ్‌ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ అందుబాటులోకి రావడంతో డ్రోన్ తయారీపై ఆసక్తి పెంచుకున్నారు. ద్రోణాచార్య టెక్ హబ్‌ సహకారంతో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంలో 60 మంది శిక్షణ పొందారు. నిపుణులే ఆశ్చర్యపోయేలా తక్కువ సమయంలోనే అధునాతన పరిజ్ఞానంతో డ్రోన్లు రూపొందిస్తున్నారు. విధుల్లో భాగంగా హై ఓల్టేజీ విద్యుత్ ప్రవహించే లైన్లపై మరమ్మతులు చేస్తుంటారు లైన్‌మెన్లు. అలా పనిచేస్తూ తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు 17వేల రూపాయల ఖర్చుతోనే డ్రోన్ తయారు చేసింది జితిన్‌ బృందం. దాని పని తీరును ఇలా వివరిస్తున్నారు.

భారీ వరదలు సంభవించినపుడు డ్రోన్ల సాయంతో బాధితులకు ఆహారం అందించడం చూసే ఉంటాం. మనిషి పర్యవేక్షణ లేకుండా యూఏఈ ఆపరేషన్స్‌ పేరిట వారం రోజుల్లోనే డ్రోన్‌ చేశారు ఈ విద్యార్థులు. ప్రకృతి విపత్తులు, వ్యవసాయం, ట్రాఫిక్‌ వంటి చోట్ల జీపీఎస్​తో ఎలా పని చేస్తుందో ఇలా వివరిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు మోడ్రన్ అటానమస్ డ్రోన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అనే సరికొత్త డ్రోన్ ఆవిష్కరించారీ విద్యార్థులు.

రాష్ట్రంలో ఆక్వా రంగంపై ఆధారపడి లక్షలాది రైతుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. చేపలు, రొయ్యల చెరువుల్లో వచ్చే బ్యాక్టీరియా, వైరస్ తెగుళ్లు సహా నీటిలో ఆక్సిజన్‌ శాతం లెక్కింపు, పర్యవేక్షణ లోపాలతో ఒక్కోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలకు తమ డ్రోన్ చెక్ పెడుతుందని హామీ ఇస్తున్నారీ విద్యార్థులు. అన్ని పనులకూ ఒకే డ్రోన్ వాడేలా వికాస్‌ మల్టీపర్పస్ డ్రోన్ రూపొందించారు ఈ విద్యార్థులు.

అమరావతి డ్రోన్ సమ్మిట్‌ నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు

ఇంజినీరింగ్‌ అయిన వెంటనే ఉపాధి దక్కేలా ఇంటర్న్‌షిప్ విద్యార్థులకు తోడ్పడుతుందని అంటున్నారు అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు. ఈ నెల 22, 23 తేదీల్లో మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. డ్రోన్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 5 వేల డ్రోన్లు ఏకకాలంలో ప్రదర్శించనుంది. ఈ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు ఈ విద్యార్థులు.

"విద్యార్థులు, సిబ్బంది హాజరును కచ్చితత్వం, వేగంతో స్మార్ట్ అటెండెన్స్ యూజింగ్ యెట్సన్ నానో విత్ డ్రోన్ లెక్కగడుతుంది. లక్ష్యాలను ఆటోమేటిక్‌ గుర్తించి అంతమొందించేలా సెల్ఫ్ డిఫెన్స్ డ్రోన్‌కు రూపకల్పన చేశాం." - విద్యార్థులు

ప్రతిష్టాత్మకంగా ఏపీలో డ్రోన్‌ సమ్మిట్‌- బెస్ట్ డ్రోన్లకు నజరానాలు - Amaravati Drone Summit 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.