ETV Bharat / state

మదనపల్లె ఫైళ్ల దహనంతో వెలుగులోకి వస్తున్న భూకబ్జాలు - 57 శాతం పూర్తైన పునఃపరిశీలన - MADANAPALLE FILES CASE

Land Grabs Coming Out With Burning of Madanapalle Files: మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనంతో భూకబ్జాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అభిప్రాయంతో పోలీసుశాఖ ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా భూ అక్రమాలకు పాల్పడినట్లు బాధితుల ద్వారా తెలిసింది.

Land Grabs Coming Out With Burning of Madanapalle Files
Land Grabs Coming Out With Burning of Madanapalle Files (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 10:51 PM IST

Updated : Aug 20, 2024, 7:58 AM IST

Land Grabs Coming Out With Burning of Madanapalle Files: రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనంతో భూకబ్జాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాల విషయాలు బయటపడుతున్నాయి. ప్రాథమిక విచారణలోనే దాదాపు 65 శాతం భూములు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు విచారణలో తేలింది. తదుపరి విచారణలో మరింతగా అక్రమాలు బయటపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అభిప్రాయంతో పోలీసుశాఖ ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. తాజాగా సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో వివరాలను సేకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

గత నెల 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాల్చేసిన ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా విచారణ చేపట్టారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఫ్రీహోల్డ్ భూములపై పునఃపరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ముందు ఘటనను ప్రభావితం చేసిన మదనపల్లె డివిజన్​లో వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ స్వయంగా క్షేత్ర పరిశీలన చేసి సిబ్బంది ద్వారా విచారణ చేపట్టారు.

పోలవరం ప్రాజెక్టు దస్త్రాల దగ్ధం కేసు - లొసుగులు తెలుస్తాయనే మసి చేశారా? - Polavaram Project Files Burnt

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ చట్టం తీసుకువచ్చాక మదనపల్లె డివిజన్​లోని 11 మండలాల్లో 38 సర్వే నంబర్​తోపాటు 416 సర్వే నంబర్ల కింద 48,273 ఎకరాల భూముల్ని ఫ్రీహోల్డ్ చేశారు. వీటిని గత కొన్ని రోజులుగా రెవెన్యూ సిబ్బంది పునఃపరిశీలన చేపట్టగా ప్రస్తుతానికి 57.52 శాతం పూర్తి అయింది. వీటిలో సర్వే నంబర్ 8, సర్వేనంబర్ 196లో ఉన్న 11,380 ఎకరాలు అక్రమంగా ఫ్రీహోల్డ్ జాబితాలోకి చేర్చినట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా ఫ్రీహోల్డ్ చేయగా సింహభాగం భూములు మదనపల్లె డివిజన్​లోనే ఉన్నాయి.

అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన భూములపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పునఃపరిశీలన చేసిన భూముల్ని సైతం మరోసారి వడపోతలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల్ని గుర్తించామని, పారదర్శకంగా ప్రక్రియను సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా భూ అక్రమాలకు పాల్పడినట్లు బాధితుల ద్వారా వెల్లడైంది. వాటిని క్షేత్ర స్థాయిలో నిగ్గు తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

మదనపల్లె అగ్నిప్రమాదం కేసు - ఎంఆర్‌ఐ డేటాలో వెలుగులోకి కీలక విషయాలు - Madanapalle Fire Accident Case

Last Updated : Aug 20, 2024, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.