ETV Bharat / state

అంతర్వేదిలో వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం - అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి

Lakshmi Narasimha Swamy Kalyana Mahotsavam: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన  అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దివ్య తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుభముహుర్త సమయంలో స్వామి కల్యాణానాన్ని అర్చకులు నిర్వహించారు. అశేష భక్త జనం స్వామి కల్యాణోత్సవాన్ని తిలకించారు. మధ్యాహ్నం కల్యాణమూర్తులను రథంపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించనున్నారు.

Lakshmi Narasimha Swamy Kalyana Mahotsavam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 9:02 AM IST

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం- తిలకించి పులకించిన భక్తులు

Lakshmi Narasimha Swamy Kalyana Mahotsavam: నింగీ నేలా మురిసిన వేళ, దివ్య నామస్మరణలు అంబరాన్ని తాకిన సమయాన, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన అంతర్వేది లక్ష్మీనరసింహుని దివ్య తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాఘ శుద్ధ దశమి ఆరుద్ర నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశాన సోమవారం రాత్రి 12.29 గంటల సుముహూర్తంలో స్వామి వారి పరిణయ వేడుకను అత్యంత వైభవోపేతంగా జరిపించారు. కల్యాణ క్రతువులోని ఘట్టాలను భక్తులకు వివరిస్తూ అర్చకులు శాస్త్రోక్తంగా వేడుకను నిర్వహించారు. అశేష భక్త జనం స్వామి కల్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు.

తిరుమలలో 'కన్నులపండువగా' రథసప్తమి వేడుకలు - పోటెత్తిన భక్తులు

Kalyana Mahotsavam With Full Glory: కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య తిరు కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. కల్యాణ వేదికను వివిధ పుష్పాలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాత్రి పది గంటల తర్వాత ఉత్సవ మూర్తుల్ని కల్యాణ వేదికపై ప్రతిష్ఠింపజేశారు. పరిణయ మహోత్సవంలో ఒక్కో ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గణపతి పూజ, విష్వక్సేన పూజ, భగవత్ పుణ్యాహవచనం, లగ్నాష్ఠక శ్లోకాల ప్రాధాన్యం భక్తులకు వివరిస్తూ అర్చకులు పఠించారు. శుభ ముహూర్తాన 12.29 నిమిషాలకు జీలకర్ర -బెల్లం క్రతువు మంగళకరంగా జరిపించారు. అనంతరం కన్యాదానం, పాణిగ్రహ ఘట్టం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాల ఘట్టాలు మంగళకరంగా జరిపించారు. ఈ కల్యాణ క్రతువును అశేష భక్తజనావళి మంత్రముగ్ధులై తిలకించారు. తీర్థ స్థలిలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరలపై కల్యాణోత్సవాలు ప్రత్యక్షంగా కనిపించడంతో ఆ దివ్య వైభవమే తళుకులీనింది.

తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు - సప్త వాహనాల్లో విహరించనున్న మలయప్ప స్వామి

Minister Venugopalakrishna Attend them Festival: ప్రభుత్వం తరఫున మంత్రి వేణుగోపాలకృష్ణ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, కోనసీమ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు స్వామివారి ఉత్సవమూర్తులకు రథోత్సవం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీనికి గాను మెరకవీధిలో సిద్ధం చేసిన దివ్య రథాన్ని పూలు, అరటి గెలలు, తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. మంగళవారం మధ్యాహ్నం 2.05 గంటలకు కల్యాణమూర్తులను రథంపై కొలువుదీర్చి అశ్వరూఢాంబిక ఆలయం మీదుగా 16 కాళ్ల మండపం సమీపం వరకు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి పూజలు : పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు

Narsimha Swamy Chariot Festival: స్వామి వారి కల్యాణ మహోత్సవాల పురస్కరించుకుని ఆలయ నిర్మాత కోపనాతి కృష్ణమ్మకు ఘనంగా అంజలి ఘటించారు ఆలయానికి ఎదురుగా ఉన్న కోపనాతి కృష్ణమ్మ విగ్రహానికి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గ సంఘ నాయకులు క్షీరాభిషేకం చేసి గజమాల అలంకరణ చేశారు. అంతర్వేది క్షేత్రంలో ఈ నెల 25 వరకు కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. అర్చకస్వామి పాణింగపల్లి శ్రీనివాసకిరణ్‌, వైదిక బృందం పరిణయోత్సవంలో ప్రతి ఘట్టాన్ని వేదమంత్రపూర్వకంగా నిర్వహించింది. ఆలయ ఛైర్మన్‌ కలిదిండి కుమార రామగోపాలరాజా బహద్దూర్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు వరప్రసాదరావు, జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, ఎస్పీ శ్రీధర్‌ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు హాజరయ్యారు. అంతకుముందు సాయంత్రం 4.30 గంటలకు పంచముఖ ఆంజనేయస్వామి, రాత్రి 7.30 గంటలకు కంచు గరుడ వాహనంపై గ్రామోత్సవాలను నిర్వహించారు.

వైభవంగా కేశవస్వామి ఉత్సవాలు ప్రారంభం- విద్యుత్ దీపాలతో మెరిసిపోతున్న ఆలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.