Lack of Staff in APSRTC due to YSRCP Government Decisions : చేతిలో కర్ర పట్టుకుని విజిల్ వేసుకుంటూ బస్టాండ్లలో తిరుగుతున్నారు. బస్టాండ్లలో తిరిగి వాళ్లు మఫ్టీలో ఉన్న పోలీసు సిబ్బందో లేదా ప్రైవేటు సెక్యూరిటీనో అనుకుంటే మీరు పొరబడినట్లే! వీళ్లంతా ఆర్టీసీలో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ కండక్టర్లు. బస్సు ఎంత రద్దీగా ఉన్నా వేగంగా టికెట్లు కొట్టే సత్తా గల ఈ కండక్టర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాల వల్ల నెలల తరబడి రోడ్లపై కాపలా డ్యూటీ చేస్తున్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేసిన జగన్ ప్రభుత్వం : ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే ఆర్టీసీ పరిరక్షణకు ట్రాఫిక్ గైడ్ల పేరిట ప్రత్యేక వ్యవస్థ ఉంది. 2003లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిని ప్రవేశ పెట్టారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ట్రాఫిక్ గైడ్లుగా నియమించేవారు. కనీస వేతనం చట్ట ప్రకారం 10 వేల రూపాయలు ఆపైన వేతనం ఇచ్చేవారు. వీళ్లంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్టాపుల్లో ఉండి బస్సుల్లోకి ప్రయాణికులు ఎక్కించేవారు. దీంతో ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా తగ్గి ఆర్టీసీకి లాభాలు వచ్చేవి. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్ - అయిదేళ్లుగా నియామకాలు నిల్
డ్రైవర్లు, కండక్టర్ల కొరత : ఆర్టీసీ నిబంధనల ప్రకారం మెడికల్‌గా అన్‌ఫిట్ అయిన డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ విధులు అప్పగించాలి. కానీ సంపూర్ణ ఆరోగ్యవంతులకు కూడా ఇలాంటి డ్యూటీలు అప్పగించారు. ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్ల కొరత చాలా ఏర్పడింది. కండక్టర్లు లేక డ్రైవర్లకే టిమ్ యంత్రాలను ఇచ్చి బస్సులను నడుపుతున్నారు.
APSRTC Recruitment: ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది కొరత.. ఖాళీల భర్తీ ఎప్పుడు..?
లాభాల బాటలో నడిపేలా చూడాలి : విజయవాడ బస్టాండ్‌లో ఐదేళ్ల క్రితం నాలుగు టికెట్ కౌంటర్లు ఉండగా సిబ్బంది లేక ఒకదానిని పూర్తిగా ఎత్తేశారు. నాన్‌స్టాప్ బస్సులకు టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రద్దీ సమయాల్లో టికెట్ల కోసం వేచి ఉండలేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు ఎక్కుతున్నారు. సిబ్బందిని నియమించమని ఏళ్లుగా కోరుతున్నా పట్టించుకోకుండా ఉన్నవారిని ఇలా దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సిబ్బందిని సద్వినియోగం చేసుకుని సురక్షిత ప్రయాణం అందిచడంతో పాటు సంస్థను లాభాల బాటలో నడిపేలా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు, ప్రయాణికులు ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
భయం,బానిసత్వం నుంచి బయటపడ్డామనే భావనలో ఆర్టీసీ ఉద్యోగులు - APSRTC Employees Problems