ETV Bharat / state

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం : కేటీఆర్‌ - KTR Visit manne krishank - KTR VISITS KRISHANK IN PRISON

KTR Visits Manne Krishank in Chanchalguda Jail : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్​పై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చంచల్ గూడ జైల్లో ఈరోజు క్రిషాంక్​ను పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేసి క్రిశాంక్​ను అరెస్టు చేశారని విమర్శించారు.

KTR Fires On Cm Revanth Reddy
KTR Visit Manne Krishank in Chanchalguda Jail
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 2:40 PM IST

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం : కేటీఆర్‌

KTR Fires On CM Revanth Reddy : బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టుపై మరోసారి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను కేటీఆర్ కలిశారు.

KTR Slams Revanth Over Krishank's Arrest : క్రిశాంక్​ను పరామర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. క్రిశాంక్‌ చేసింది తప్పని నిరూపిస్తే తాను జైలుకు వెళ్తానని అన్నారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్, తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలని సవాల్ చేశారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని, ఇలా నిర్దోషులను కాదంటూ మండిపడ్డారు. క్రిశాంక్ జైల్లో నిబ్బరంగా ఉన్నారని త్వరలోనే విడుదలవుతారని కేటీఆర్ తెలిపారు.

ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు : కేటీఆర్​తో పాటు క్రిశాంక్​ను అతడి భార్య సుహాసిని కూడా జైల్లో కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె కూడా మీడియాతో మాట్లాడారు. తన భర్తపై తప్పుడు కేసు పెట్టారని క్రిశాంక్‌ భార్య సుహాసిని ఆరోపించారు. ఇలాంటి కేసులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఓయూ మెస్‌ల మూసివేతపై సర్క్యులర్‌ను మార్ఫింగ్‌ చేశారన్న అభియోగంపై ఈ నెల 1వ తేదీన క్రిశాంక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

"క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం. చేయని తప్పునకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులుగా క్రిశాంక్​ను వేధిస్తోంది. నా సోదరుడు తప్పు చేసినట్లు నిరూపిస్తే నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం. నిరూపణ కాకుంటే సీఎం రేవంత్ జైలుకు వెళ్తారా? రేవంత్ మీకు దమ్ముంటే మీరు పెట్టిన సర్క్యులర్ క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెడదాం ఎవరు తప్పు చేశారో వారిని జైల్లో పెడదాం. నిబ్బరంగా ఉన్న క్రిశాంక్ త్వరలో విడుదలవుతారు." -కేటీఆర్‌ , కార్యనిర్వాహక అధ్యక్షుడు

దేశం కోసం ఏదైనా విజన్​ ఉంటే చెప్పండి - సమాజంలో డివిజన్​ మాత్రం సృష్టించవద్దు : కేటీఆర్​ - KTR Tweet on PM Modi

బీఆర్​ఎస్​ను 10 సీట్లలో గెలిపిస్తే - 6 నెలల్లో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసించే స్థితికి వస్తారు : కేటీఆర్ - KTR ON LOK SABHA ELECTIONS 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.