KTR Tweet on Sarpanches in Telangana : రాష్ట్రంలో నేటితో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ ప్రజాసేవకు కాదని అన్నారు. ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసి పదవీ విరమణ చేస్తున్న అందరికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో వారి పాత్ర ఎనలేనిదని వివరించారు. మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు.
Telangana Sarpanch Tenure Ends Today : మరోవైపు సర్పంచ్‌లుగా పదవీ విరమణ చేశామని నిరుత్సాహపడ వద్దని, రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చని కరీంనగర్ మాజీ ఎంపీ , బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్ అన్నారు. ఈ రిజర్వేషన్లతో జరుగుతున్నవి ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన తర్వాతనే ఉంటాయని చెప్పారు. అందులో మహిళా రిజర్వేషన్ కారణంగా, మళ్లీ మీరే ఎమ్మెల్యేలు కావచ్చని తెలిపారు. దానికి ఉదాహరణగా పాలకుర్తిలో ఓటమి పాలైన ఎర్రబెల్లి దయాకర్ రావు అంశాన్ని ప్రస్తావించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో పదవీ విరమణ చేసిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Best panchayat in nalgonda : గ్రామస్తుల కృషి.. ఉత్తమ గ్రామ పంచాయతీగా 'శ్రీనివాస్‌నగర్'
Special Officers in Gram Panchayats Telangana : ఈరోజు నుంచి సర్పంచ్‌ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో, ఇక పాలనను అధికారులకు (Telangana Gram Panchayats) అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2 నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌ల నుంచి రికార్డులు, చెక్ బుక్‌లు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే సర్కార్ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగగా ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Gram Panchayat Audit in Telangana : సర్పంచుల ఇష్టారాజ్యం.. నిగ్గుతేల్చిన రాష్ట్ర ఆడిట్ శాఖ
ఇవాళ్టితో ముగియునున్న తమ పదవీ కాలాన్ని పొడిగించాలని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర సర్కార్‌ను కోరింది. తమకు రావాల్సిన పెండింగ్ నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. తమకు పదవి లేకపోతే అప్పుల బాధ తట్టుకోలేమని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఫిబ్రవరి 2న రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేస్తామని తెలిపింది.
TS Grama Panchayat: యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన.. లెక్కాపత్రాల మాటే లేదు!
బీఆర్ఎస్ నాయకులకు సర్పంచుల గురించి మాట్లాడే హక్కు లేదు : బండి సంజయ్