KTR Tweet On National Handloom Day 2024 : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఎక్స్ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేత రంగానికి బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగం అన్నారు. మగ్గానికి మంచి రోజులు తెచ్చిన దార్శనికుడు వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ రూ. 600 కోట్లే బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి రూ. 1200 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
కేసీఆర్ హయాంలో నేతన్నలకు గుర్తింపు : కేసీఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. చేనేత కళాకారులకు ఆసరా పెన్షన్‌తో ఆపన్న హస్తం అందించాని తెలిపారు. గతంలో పద్మశాలీల ఆత్మగౌరవం పెంచే చారిత్రక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నామన్నారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని గట్టెక్కించిన యజ్ఞం చేపట్టామని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. సిరిసిల్లలో అప్పరెల్ పార్క్ ఏర్పాటు ఓ సంకల్పమని వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఓ సంచలనమని పేర్కొన్నారు.
Last year, on this day #BRS Govt celebrated #NationalHandloomDay with handloom weavers & artists, presenting awards to them.
— Nayini Anurag Reddy (@NAR_Handle) August 7, 2024
New and revised schemes for the welfare of weavers in #Telangana were announced:
• Telangana Chenetha Maggam Scheme: All pit looms will be replaced… pic.twitter.com/EKHS7ryiHq
బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలి : ఎన్నో విప్లవాత్మక పథకాలకు చిరునామా తెలంగాణ రాష్ట్రం అన్నారు. దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో చేనేత మిత్ర, నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం తెచ్చామన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులని కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఛిద్రమవుతున్న బతుకులని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణ మృదంగం వినిపిస్తోందన్నారు. ఇప్పటికైనా ఇరు ప్రభుత్వాలు కళ్లు తెరిచి సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
నరాలను పోగులుగా చేసి..
— KTR (@KTRBRS) August 7, 2024
తమ రక్తాన్ని రంగులుగా వేసి..
గుండెలను కండెలుగా మార్చి..
చెమట చుక్కల్ని చీరలుగా మలచి..
పేగులను వస్త్రాలుగా అందించి..
మనిషికి నాగరికతను అద్దిన..
చేనేత కార్మికులందరికీ..
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా..
హృదయపూర్వక శుభాకాంక్షలు
దశాబ్దాలపాటు దగాపడ్డ…
"నరాలను పోగులుగా చేసి..
తమ రక్తాన్ని రంగులుగా వేసి..
గుండెలను కండెలుగా మార్చి..
చెమట చుక్కల్ని చీరలుగా మలచి..
పేగులను వస్త్రాలుగా అందించి..
మనిషికి నాగరికతను అద్దిన చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు"
-కేటీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్