ETV Bharat / state

ఆక్రమణల చెరలో ఉప్పుటేరు- దారిలేక లంకగ్రామాలను కుమ్మేస్తోన్న బుడమేరు - Kolleru Lanka Stuck in Flood Effect

Kolleru Lanka Villages Stuck in Flood Effect : విజయవాడని అల్లకల్లోలం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలపై విరుచుకుపడుతోంది. వరద నీరు భారీగా చేరడంతో లంకలు నీట మునిగాయి. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరు ఆక్రమణలు, నిర్వహణ లేమితో చిక్కిపోయింది. ప్రవాహానికి అడుగడుగునా ఏర్పడుతున్న అడ్డంకులతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

KOLLERU LANKA STUCK IN FLOOD EFFECT
KOLLERU LANKA STUCK IN FLOOD EFFECT (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 5, 2024, 10:55 AM IST

Kolleru Lanka Villages Stuck in Flood Effect : కొల్లేరు లంక గ్రామాలు ముంపు గుప్పెట్లో చిక్కుకుంటున్నాయి. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ అతలాకుతలం కాగా ఆ వరద నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలకు వరద పోటు తాకింది. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకువెళ్లే ఉప్పుటేరు ఓ వైపు ఆక్రమణలు, నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ వరద ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండల్లాలోని గ్రామాలపై పడనుంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, మున్నేరుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలకు కొల్లేరులో కలిసే 68 మేజర్, మైనర్‌ డ్రెయిన్లు సైతం భారీగా వరద నీటిని తీసుకొస్తున్నాయి. దీంతో కొల్లేరు మరింత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కొల్లేరులో మామూలు రోజుల్లో 10వేల క్యూసెక్కులు మాత్రమే ఉండే నీరు ప్రస్తుతం 25 వేల క్యుసెక్కులకు చేరింది.

ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా నీరు : కొల్లేరు ఉగ్రరూపం దాల్చడంతో బుధవారం ఉదయం నుంచే మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మణుగులూరు, కొవ్వాడలంక గ్రామాల్లోనూ నీరు చేరింది. చినఎడ్లగాడి దగ్గర ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిపై రెండు చోట్ల రెండడుగుల ఎత్తులో ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది.

శాంతించిన కృష్ణమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - KRISHNA River Flood Flow Decrease

ఆక్రమణల చెరలో ఉప్పుటేరు : కొల్లేరు నీరు ఉప్పుటేరు ద్వారా మొగల్తూరు మండలం ములపర్రు దగ్గర సముద్రంలో కలుస్తుంది. కానీ ఉప్పుటేరు ఆక్రమణల చెరలో ఉంది. దాదాపు 5 వేల ఎకరాల వరకు ఆక్రమించుకుని ఆక్వా సాగు చేస్తున్నారు. కొందరు ఇళ్లు కట్టేశారు. ఉప్పుటేరు ఒక్కరోజులో 15 వేల క్యూసెక్కులు సముద్రంలోకి తీసుకువెళుతుంది. ఆక్రమణలతో అది 10 వేల క్యూసెక్కులకు పడిపోయింది. సామర్థ్యానికి మించి నీరు చేరితే కొల్లేరు లంక గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్రజలతో పాటు వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టాల పాలవుతున్నారు.

భారీ వర్షాలు, వరదలతో 32 మంది మృతి - విరాళాలు ఇచ్చేవారికి పన్ను మినహాయింపు - Several People Dead in Floods

గాలికొదిలేసిన గత ప్రభుత్వాలు : ఉప్పుటేరు నిర్వహణను గత ప్రభుత్వాలు పూర్తిగా గాలికొదిలేశాయి. చివరిగా 12 ఏళ్ల క్రితం ఒక్కసారి తవ్వారు. అప్పటి నుంచి ప్రక్షాళన చేయలేదు. గత అయిదేళ్లలో తూడు, గుర్రపుడెక్క కూడా తొలగించలేదు. ఎక్కడ చూసినా కిక్కిసగడ్డి, తూడు, గుర్రపుడెక్కతో ఉప్పుటేరు నిండిపోయింది. దీంతో ప్రవాహ వేగానికి అవరోధాలు ఏర్పడి చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతున్నాయి. అధికారులు, పాలకులు ఇప్పటికైనా ఉప్పుటేరు ఆక్రమణలు తొలగించి సక్రమంగా నిర్వహించకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరద బాధితులకు ఉద్యోగుల భారీ సాయం - రూ.120 కోట్ల విరాళం - APNGO Leaders Announced Donation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.