Manikya Rao Allegations on Pinnelli Brothers: పల్నాడు జిల్లాలోని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేశారని తెలిపారు. టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం ఎవరిచ్చారంటూ దాడి చేశారని తెలిపారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తన కుటుంబం పైనా దాడి చేసినట్లు తెలిపారు. వాళ్ల అనుచరులు తన పెద్దకుమారుడి పొట్టపై తన్నారని ప్రాణాలకు తెగించి టీడీపీ పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నానని అన్నారు.
వెంకట్రామిరెడ్డి కాళ్లు పట్టుకుని మా వదిన బ్రతిమాలినా వదల్లేదని మాణిక్యరావు అన్నారు. నా కుటుంబంపై ఆయనకు అంత కక్ష ఎందుకని అన్నారు. ఆయనకు భయపడి అధికారులు నోరు మెదపలేదని నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదని తెలిపారు. డీఎస్పీ ఉండగానే నాపై దాడికి యత్నించారని అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారని పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాలా బెటర్ అని అన్నారు. నన్ను చంపేంత తప్పు ఏం చేశాను వైఎస్సార్సీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా అని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు.
పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి నాపై దాడి చేసి నన్ను దుర్భాషలాడారు. అంతుచూస్తామని నన్ను బెదిరించారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టి టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబపైనా దాడి చేశారు. పిన్నెల్లి అనుచరులు నా పెద్దకుమారుడి పొట్టపైనా తన్నారు అయినా ప్రాణాలకు తెగించి పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నా. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నా వదిన కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా వదల్లేదు నా కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి అంత కక్ష ఎందుకు. పిన్నెల్లికి భయపడి అధికారులు నోరు కూడా మెదపలేదు. నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్.- మాణిక్యాలరావు, పిన్నెలి బాధితుడు
ఒక కేసులో అరెస్టొద్దంటే మొత్తానికే వదిలేస్తారా?- పిన్నెల్లిపై పోలీసుల స్వామిభక్తి - PINNELLI CASE
Seshagiri Rao, His Family Were Threatened By MLA Pinnelli : పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ప్రతినిధిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తించారని తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు తెలిపారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లోకి పిన్నెల్లి తన అనుచరులతో కలిసి దూసుకువచ్చారు. ఈవీఎంను నేలకేసి కొట్టారని ఆయన వెల్లడించారు. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు యత్నించగా తనపైనే దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందన్నారు శేషగిరిరావు.
ఫిర్యాదుకు నిరాకరించిన పోలీసులు: వెంకట్రామిరెడ్డి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మాణిక్యరావుపై మంగళగిరి గ్రామీణ పోలీసుల ఉదాసీనతగా వ్యవహరించారు. జీరో ఎఫ్‌ఐఆర్ తీసుకునేందుకు పోలీసుల నిరాకరించారు. మంగళగిరి పీఎస్‌లో 3 గంటలుగా మాణిక్యరావు ఎదురుచూశారు. ఈ క్రమంలో ఫిర్యాదును పల్నాడు జిల్లాలో ఇవ్వాలని పోలీసులు సూచించారు. అక్కడకు వెళ్లే పరిస్థితి లేకే మంగళగిరి పీఎస్‌కు వచ్చానన్న మాణిక్యరావు తెలిపారు. పోలింగ్ రోజు తెదేపా పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్న మాణిక్యరావు, అతడి కుటుంబసభ్యులపై పిన్నెల్లి దాడి చేశారు.