ETV Bharat / state

'నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడి' - జానీ మాస్టర్​ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు - Jani Master Remand Report

JANI MASTER REMAND REPORT: లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్ విధించగా, చంచల్​గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు.

Jani Master Remand Report
Jani Master Remand Report (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 4:43 PM IST

Updated : Sep 20, 2024, 4:51 PM IST

JANI MASTER REMAND REPORT : ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్​కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్​గూడ జైలుకు తరలించారు. అక్టోబరు 3 వరకు జానీ మాస్టర్​ రిమాండ్​లో ఉండనున్నారు. లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్, అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​పై అత్యాచారం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆయనను గురువారం గోవాలో అరెస్ట్​ చేసిన పోలీసులు నేడు హైదరాబాద్​కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పోలీసులు పేర్కొన్నారు. నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు. 2019లో జానీకి బాధితురాలు పరిచయమైందని, దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్‌గా చేర్చుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. 2020లో ముంబయిలోని హోటల్‌లో జానీ లైంగిక దాడి చేశారని, ఆ సమయంలో బాధితురాలి వయసు 16 ఏళ్లు అని వెల్లడించారు. నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడికి పాల్పడ్డారని, విషయం బయటకు రాకుండా బెదిరించారని అన్నారు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తానంటూ జానీ బెదిరించారన్న పోలీసులు, పలుకుబడితో బాధితురాలికి అవకాశాలు రాకుండా చేశారని తెలిపారు. జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించిందని వివరించారు. అటు జానీ మాస్టర్‌కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించగా, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.

అత్యాచారం జరిగిందనడానికి సాక్ష్యమేంటి? - నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife Comments

Jani Master Issue: తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్‌ ఈనెల 15న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్థారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్‌ను చేర్చారు.

జానీమాస్టర్‌ వ్యవహారం తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపింది. నార్సింగ్ పోలీసులు తొలుత ఫోన్‌ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మణికొండలోని నివాసానికి పోలీసులు వెళ్లి ఆరా తీయగా ఇంట్లోనూ లేరు. పనిమనిషిని ప్రశ్నించగా జానీ మాస్టర్‌ చెన్నై వెళ్లినట్లు చెప్పారు. కేసు నమోదైన తర్వాత సినిమా షూటింగ్‌ల కోసం నెల్లూరు, లద్దాఖ్‌ ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు భావించి ఆరా తీసినా ఆచూకీ మాత్రం చిక్కలేదు.

పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ : పరారైనట్లు నిర్థారించుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో నిర్థారించుకున్నారు. పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో జానీ మాస్టర్‌ ఒక చిన్నహోటల్‌లో తలదాచుకున్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్‌ ఎస్వోటీ పోలీసుల బృందం బుధవారం సాయంత్రం హైదరాబాద్​ నుంచి గోవాకు బయల్దేరింది. గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో ట్రాన్సిట్‌ వారెంట్‌ తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ తీసుకువచ్చారు.

అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ ఫిర్యాదు - గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ - Jani Master Arrest in Bangalore

Last Updated : Sep 20, 2024, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.