ETV Bharat / state

తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయి : జస్టిస్‌ పీసీ ఘోష్‌ - Justice PC Ghosh on Kaleshwaram - JUSTICE PC GHOSH ON KALESHWARAM

Justice PC Ghose Commission on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టును నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలనే ఆదేశాలమేరకే పనిచేశామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పినట్లు, కాళేశ్వరంపై విచారణ కమిషన్‌ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలపై, వారిని అడిగినట్లు జస్టిస్ ఘోష్‌ వివరించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించినట్లు తెలిపారు. తప్పుడు అఫిడవిట్, ఫైల్ చేసిన వారిపై చర్యలు ఉంటాయని చెప్పారు.

Justice PC Ghose Told Representatives of construction companies to Submit Affidavit
Justice PC Ghose Commission on Kaleshwaram (eenadu.net)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 3:47 PM IST

Justice PC Ghose Judicial Inquiry on Kaleshwaram : కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల వ్యవహారంపై జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్ న్యాయ విచారణ ముమ్మరంగా కొసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్​ను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు బ్యారేజీల పనులు చేసినట్లు నిర్మాణసంస్థల ప్రతినిధులు చెప్పినట్లు కాళేశ్వరం విచారణ కమిషన్ ఛైర్​పర్సన్​ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు.

నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ సంబంధిత అంశాల గురించి కమిషన్ విచారణలో ఆరా తీసింది. సంబంధిత వివరాలు తీసుకున్నారు.

తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన వారిపై చర్యలు : నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. కమిషన్​కు ఎవరు, ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు అడుగుతున్నట్లు వివరించారు.

తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన వారిపై చర్యలు ఉంటాయనీ అన్నారు. అఫిడవిట్లు అన్ని పరిశీలించాక అవసరమైన వారిని విచారణకు పిలుస్తామని, లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని పీసీ ఘోష్ పేర్కొన్నారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయన్న అంశాలు రికార్డు రూపంలో వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని అన్నారు.

Kaleshwaram Judicial Commission Update : విజిలెన్స్, కాగ్ నివేదికలు కూడా ఉన్నాయని, వారిని కూడా పిలిచి వివరాలు తీసుకుంటామని కమిషన్ ఛైర్​పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. కాగా ఇప్పటికే 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజినీర్లను విచారించి, అఫిడవిట్‌ ద్వారా అన్ని విషయాలు వెల్లడించాలని పీసీ ఘోష్​ కమిషన్​ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో వారికి సైతం జూన్‌ 25లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఇంజినీర్లందరూ జూన్‌ 25 లోపు అఫిడవిట్‌ సమర్పించాలని చెప్పాం : జస్టిస్‌ పీసీ ఘోష్‌ - Kaleshwaram Judicial Commission

ఆనకట్టల్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది - తప్పుడు సమాచారమిస్తే చట్టపరమైన చర్యలు : జస్టిస్ పీసీ ఘోష్ - Justice PC Ghose on Kaleshwaram

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.