ETV Bharat / state

ధవళేశ్వరం వద్ద 13.90 అడుగులకు చేరిన నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక జారీ - SECOND WARNING AT DAWALESWARAM - SECOND WARNING AT DAWALESWARAM

People Facing Problems due to Heavy Floods in Konaseema : కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆనకట్ట వద్ద 13.90 అడుగులకు నీటిమట్టం చేరింది. 13.06 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని అధికారుల సూచించారు.

People Facing Problems due to Heavy Floods in Konaseema
People Facing Problems due to Heavy Floods in Konaseema (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 3:54 PM IST

Updated : Jul 27, 2024, 5:03 PM IST

SECOND WARNING AT DAWALESWARAM : గోదావరిలో వరద మళ్లీ క్రమంగా పెరుగుతోంది. నిన్నంతా(శుక్రవారం) హెచ్చుతగ్గులతో కొనసాగిన ప్రవాహం ఈరోజు ఉదయం నుంచి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరదనీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.90 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13.06 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు, కల్వర్టులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. భద్రాచలం వద్ద గంట గంటకు వరద ప్రవాహం పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరదనీరు చుట్టు ముట్టేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వరదనీరు వదులుతుండడంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రవహించే గౌతమీ గోదావరి బాలయోగి వారధి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజీవ్ బీచ్ పరివాహక ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖకు చెందిన వాటర్ స్పోర్ట్స్ నీట మునిగింది. మత్స్యకారులు తమ మెకనైజ్డ్ బోట్లు, నావలు, వలలు కొట్టుకుపోకుండా టైడల్ లాక్ వద్దకు చేర్చి తాళ్లతో బంధించారు.

ఎడతెరపి లేని వాన, వరదల ఉద్ధృతి- జలదిగ్భంధంలో జనజీవనం - ap People Suffering With Floods

Heavy Floods in Konaseema: కోనసీమలోని లంకల్ని మరింతగా వరద నీరు చుట్టుముట్టేస్తోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు కారణంగా గోదావరికి వరద నీరు పోటెత్తింది. లంక ప్రాంతాల్లో గౌతమి గోదావరి, వశిష్ట గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లంక గ్రామాల్లో అరటి, కూరగాయల తోటలు పూర్తిగా నీటమునిగాయి. వరద నీరు పెరిగే అవకాశం ఉండటంతో పంటలు పాడైపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వరద గుప్పిట్లోనే : వర్షం తగ్గినా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ముమ్మిడివరం మండలంలోని పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై వరద నీరు భారీగా ప్రవహించడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ప్రజలు బాహ్య ప్రపంచంలోకి పడవల ద్వారా రావాల్సివస్తుంది. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో గౌతమి గోదావరి బాలయోగి వారధి వద్ద వరద పోటెత్తుతుంది. రాజీవ్‌ బీచ్‌ పరివాహక ప్రాంతంలో ఉండే పుదుచ్చేరి పర్యాటక శాఖకు చెందిన వాటర్‌ స్పోర్ట్స్‌ ప్రదేశం నీట మునిగింది. మరోవైపు మెకనైజ్డ్‌ బోట్లు, నావలు కొట్టుకుపోకుండా మత్స్యకారులు టైడల్‌ వద్ద తాళ్లతో బంధించారు.

బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు : గోదావరి వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన లంక గ్రామాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. కోనసీమ జిల్లా ఉడుముడి లంక గ్రామంలో తాజాగా ఇలాంటి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఉడుముడి లంకకు చెందిన జేమ్స్‌ అనే వ్యక్తికి వెన్నునొప్పి రావడంతో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామం గోదావరి మధ్యలో ఉండటం, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబసభ్యులు అవస్థలు పడ్డారు. మంచంపై జేమ్స్‌ను పడుకోబెట్టి నలుగురు వ్యక్తును ఉడుముడి లంక నుంచి గోదావరి రేవు వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో పడరాని పాట్లు పడ్డారు.

రోజువారి జీవనానికి తీవ్ర ఇబ్బందులు : ముమ్మిడివరం నియోజవర్గ పరిధిలో గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలంలోని లంక గ్రామాలైన గురజాపులంక, కూనాలంక, ఠానేలంక చెందిన మెట్ట పంటలు, గ్రామాలు ఇంకా ముంపు నీటిలోనే నానుతున్నాయి. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇప్పటికి ముంపు నీటిలోనే లంక వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. వరద నీటికి తోడు నిన్న (శుక్రవారం) రాత్రి నుండి ఏకధాటిగా వర్షాలు పడుతుండటంతో రోజువారి జీవనానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కంటిమీద కునుకులేకుండా చేస్తున్న గోదావరి వరద- నీళ్లలో నానుతున్న ఇళ్లు, పొలాలు - heavy rains in Konaseema

లంకలను ముంచెత్తిన వరద గోదారి - బిక్కుబిక్కుమంటున్న కోనసీమ వాసులు - Godavari Floods in Lanka Villages

Last Updated : Jul 27, 2024, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.