Nimmala Rama Naidu on Polavaram : పోలవరంపై జగన్ నిత్యం విషం కక్కుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు దశల గురించి ఎక్కడా గతంలో ప్రస్తావనే లేదన్న మంత్రి, వైఎస్ జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్ల ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 55,548 కోట్ల రూపాయలు అప్పటి టెక్నికల్ అడ్వైజరి కమిటీ ఆమోదించినప్పుడు కూడా దశల గురించి ప్రస్తావన లేదన్నారు.
పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తి లేదు: జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్ల అనే అంశానికి బీజం పడిందని విమర్శించారు. 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టేందుకు పీపీఏ, సీడబ్ల్యూసీకు ప్రతిపాదన పంపారన్నారు. కేంద్ర క్యాబినెట్ 12,157 కోట్లకు ఆమోదించారని, అందులో ప్రాజెక్టు ఎత్తుపై ప్రస్తావన లేదని వైఎస్సార్సీపీ మళ్లీ ఆరోపిస్తోందని ఆక్షేపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ కూటమి సర్కారు పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
పోలవరం ఎత్తుపై రాజ్యసభలో చర్చ - ఆ విషయంలో తగ్గేదేలేదని వెల్లడి
Nimmala Rama Naidu on YS Jagan: సెకితో విద్యుత్ ఒప్పందంలో తన పేరు లేదని జగన్ చెబుతున్నారని, ఎఫ్‌బీఐ చేసిన అభియోగపత్రంలో అప్పటి ముఖ్యమంత్రి అని ఉందని మంత్రి నిమ్మలరామనాయుడు వెల్లడించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా లేరా మరి అప్పుడు సీఎం ఎవరని ప్రశ్నించారు. జగన్ సతీమణి భారతీ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎంగా వ్యవహరించారా అని నిలదీశారు. ఒప్పందం మేరకు 2024 నుంచే విద్యుత్ రావాల్సి ఉన్నా ఎన్నికలున్నాయని లాలూచీపడి ముందే విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు.
అబద్దాలకు పెటేంట్ జగన్‌కే ఉంది: సంపద సృష్టించానని చెబుతున్న జగన్ 9 సార్లు ఎందుకు విద్యుత్ ఛార్జీలు పెంచారని మంత్రి ప్రశ్నించారు. 2019-24లో చేసిన పాపాలే ఇవాళ్టికీ ప్రజల్ని, డిస్కమ్‌లను వెంటాడుతున్నాయన్నారు. డిస్కమ్‌ల నెత్తిన 18 వేల కోట్ల రూపాయల మేర అప్పులు మోపి వెళ్లిపోయారని మండిపడ్డారు. అబద్దాలకు పెటేంట్ జగన్‌కే ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు.
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై స్పష్టత ఇచ్చిన పీపీఏ - రెండు దశల ప్రస్తావన లేదని వెల్లడి