ETV Bharat / state

నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సన్నద్ధం - ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

Irrigation Department Presentation Today : గత ప్రభుత్వం నీటి పారుదల శాఖపై జరిగిన లోపాలు, అభివృద్ధిపై ప్రజాభవన్‌లో ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఈ శాఖపై స్పష్టత ఇస్తామని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య తెలిపారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని ఆరోపించారు.

Uttam Kumar Presentation on Telangana Projects
Presentation on Irrigation Department
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 7:17 PM IST

Updated : Feb 11, 2024, 10:34 PM IST

Irrigation Department Presentation Today : ప్రజాభవన్​లో నీటిపారుదల శాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆధ్వర్యంలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. సోమవారం శాసనసభ సమావేశంలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది.

కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు: మంత్రి ఉత్తమ్‌

Uttam Kumar Irrigation Department Presentation : గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖలో జరిగిన లోపాలు, చేసిన పనులు లక్ష్యంగా ఈ ప్రజెంటేషన్‌ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యుహంపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్​ రెడ్డి(Uttam Kumar Reddy) దిశా నిర్థేశం చేశారు. కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించే విషయంలో నెలకొన్న వివాదంలో ప్రధానంగా చర్చ జరిగింది.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి : ఉత్తమ్

Berla Ilayya on Krishna River Water : సోమవారం అసెంబ్లీ సాక్షిగా కృష్ణా జలాలపై స్పష్టత ఇస్తామని బీర్ల ఐలయ్య అన్నారు. తమ ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ నీళ్లను ఏపీ సీఎం జగన్ కోసం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారని ఆరోపించారు. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సాయం చేశారని జగన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. గులాబీ దళానికి బుద్ది చెబుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంట్ రగిల్చి ఓట్లు కొల్లగొట్టడంలో కేసీఆర్ దిట్టన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం పోలింగ్ రోజు డ్రామాలు చేశారని మండిపడ్డారు. ఇరిగేషన్(Irrigation Deportment) ప్రాజెక్టుల్లో నిధులు దోచుకొని ఎన్నికలకు ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరంలో ఒక బ్యారేజీ కూలిపోయింది, మరొకటి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది: ఉత్తమ్

"జగన్‌తో కుమ్మకై తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకి ఏపీలో జరిగిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కృష్ణా జలాలపై జరుగుతున్న ప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పి కొడతాం. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్లు కేసీఆర్ లూటీ చేశారు."- మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ

MLA Srinivas Comments on KCR : తెలంగాణకి ఉమ్మడి పాలకులు చేసిన అన్యాయం కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువని ప్రభుత్వ విప్‌ శ్రీనివాస్ ఆరోపించారు. జగన్, కేసీఆర్ మాట్లాడుకున్న తర్వాత నాగార్జున సాగర్‌పైకి పోలీసులు వచ్చారన్నారు. కేసీఆర్ చేసిన పనుల వల్ల దక్షిణ తెలంగాణ భవిష్యత్తులో ఎడారిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కేసీఆర్(KCR) కృష్ణా జలాలపై పోరాటం అంటూ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు.

రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖను విధ్వంసం చేసిన ఘనత కేసీఆర్​దే : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

Last Updated : Feb 11, 2024, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.