ETV Bharat / state

అనంత ఓటర్ల జాబితాలో అక్రమాలు- ఒకే ఇంటి నంబరుపై వందకు పైగా ఓట్లు! - ఒకే ఇంటి నంబరుపై వందకు పైగా ఓట్లు

Irregularities in AP Voter List: అనంతపురం జిల్లాలో ఒకే ఇంటి నంబరుపై వందకుపైగా ఓట్లు నమోదయ్యాయి. దీంతో నివ్వెరపోయిన గ్రామస్థులు వైఎస్సార్సీపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Irregularities_in_AP_Voter_List
Irregularities_in_AP_Voter_List
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 4:33 PM IST

Irregularities in AP Voter List: అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవల్లిలో ఒకే ఇంటి నంబరుపై వందకుపైగా ఓట్లు ఉండటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. ఊరిలో లేని వారిని సైతం ఓటర్లుగా చేర్చి జాబితాలో వారి ఫొటోలను ముద్రించారు. పోలింగ్‌ కేంద్రం 91లో 704, 92లో 849 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు.

Anantapur District Voters List: ఓటర్ల జాబితాను చూసిన గ్రామస్థులు నివ్వెరపోయారు. వారంతా గ్రామానికి చెందిన ఓటర్లు కాదని తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చూడాలని గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

"మా గ్రామంలో ఒకే ఇంటి నంబరుపై వందకుపైగా ఓట్లు ఉన్నాయి. ఊర్లో లేని వారిని ఓటర్లుగా చేర్చారు. జాబితాలో వారి ఫొటోలను సైతం ముద్రించారు. గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం 91లో 704, 92లో 849 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటి నంబరు 1-222ఏ, 1-224ఏ గా వేసి ఫొటోలతో ఓటర్లుగా నమోదు చేశారు. వారంతా మా గ్రామానికి చెందినవారు కాదు. గతంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగకుండా చూడాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు." - గ్రామస్థులు

'దొంగ ఓట్లతో వైసీపీ గెలవాలనుకుంటోంది' - తిరుపతిలో టీడీపీ నాయకుల ఆందోళన

Delay on Parchoor Voter Verification Process: మరోవైపు బాపట్ల జిల్లా పర్చూరులో తుది ఓటర్ల జాబితా విడుదల విషయంలో ఎన్నికల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఓటర్ల తొలగింపు, మార్పులకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణను ఎన్నికల సంఘం ఈ నెల 12న నిలివేసింది. దీనికి ముందు రెండు రోజులు 22వేల 381 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తరువాత వరుసగా నాలుగు రోజులు సంక్రాంతి సెలవులు రావటంతో అధికారులు విచారణ చేపట్టలేదని చెప్పారు.

Election Commission On AP Fake Votes: దరఖాస్తుల విచారణను 16వ తేదీ నుంచి ప్రారంభించినప్పటికీ వీటి విచారణ పూర్తి చేసి అర్హులైన వారి వివరాలు తుది జాబితాలో ప్రచురించడం అనుమానంగానే ఉంది. కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు తుది జాబితాలో లేకున్నా తరువాత జాబితాలో వస్తాయని అధికారులు చెబుతున్నారు. అధికార వైఎస్సార్సీపీ నేతలు ఓట్ల తొలగింపు కోసం చివరిరోజు వెయ్యికి పైగా దరఖాస్తులు పెట్టినట్లు అధికారులు తెలిపారు. వీటి విచారణకు అధికారులు సైతం భయపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఓట్లు తొలగిస్తే ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆందోళన చెందుతున్నారు.

విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.