ETV Bharat / state

ఆ అధికారికి ఏకకాలంలో మూడు బాధ్యతలు - పోస్టు ఏదైనా ప్రతిపక్షమే టార్గెట్​ - Police Attacks on Tdp leaders

IPS Kolli Raghuram Reddy Targeting TDP Leaders: ఏ పోస్టులో ఉన్నా, ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నా సరే ప్రతిపక్ష తెలుగుదేశం నేతలను వేధించడమే ఆయన ప్రధాన ఎజెండాగా పని చేస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం జగన్‌ సర్కార్‌ ఏర్పాటు చేసిన సిట్‌ అధిపతిగా, నిఘా విభాగం ఐజీగా ఆయన తొలి నుంచీ టీడీపీ నాయకులను ఇబ్బంది పెట్టడంలోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తాజాగా ఆ పోస్టునూ వాడేశారు. మాజీ మంత్రి నారాయణ లక్ష్యంగా దాడులు జరిపించారు. ఆయనే ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి.

IPS_Kolli_Raghuram_Reddy_Targeting_TDP_Leaders

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 7:19 AM IST

పోస్టు ఏదైనా ప్రతిపక్షాన్ని వేధించటమే - ఐపీఎస్‌ కొల్లి రఘురామ్‌రెడ్డిపై విమర్శలు

IPS Kolli Raghuram Reddy Targeting TDP Leaders : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత పొంగూరు నారాయణ నివాసం, వైద్య కళాశాలకు ఔషధ నియంత్రణ విభాగాధికారులను పంపి ఐపీఎస్‌ అధికారి, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ కొల్లి రఘురామ్‌రెడ్డి తనిఖీలు చేయించారు. అధికారులు అక్కడ తలుపులు, బీరువాలు పగలగొట్టించి మరీ సోదాలు జరిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సహా 70 మందికి పైగా పోలీసులతో దండెత్తి నాలుగున్నర గంటల పాటు అలజడి సృష్టించారు. ఇంత చేసినా సరే మందుల క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలాంటి పత్రాలూ వారికి లభించలేదు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సోదాలు జరపాలి. బాధ్యులు ఎంత పెద్దవారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలక నేతే లక్ష్యంగా దాడులు చేయటాన్ని కక్ష సాధింపు చర్యలు అనకపోతే ఇంకేమనాలి? ఏదో ఉగ్రవాద శిబిరంపైకి వెళ్లినట్లు దండెత్తటం వేధించటం కాక మరేమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రతిపక్షాలపై కక్ష సాధించటానికేనా? : ప్రపంచాన్ని గడగడలాడించే ఐసీస్‌, బోకోహరామ్‌ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే 'ఐసిస్‌ డ్రగ్‌ (ISIS Drug)'గా పేరొందిన 'ట్రెమడాల్‌ (Tramadol)' మాదకద్రవ్యాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సేఫ్‌ ఫార్ములేషన్స్‌ ఔషధ కంపెనీలో మాత్రల రూపంలో తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉదంతాన్ని ముంబై కస్టమ్స్‌ విభాగం బయటపెట్టినా సరే ఏపీ ఔషధ నియంత్రణ విభాగం ఈ స్థాయిలో అక్కడికి వెళ్లి దాడులు చేయలేదు. పోలీసుల్నీ తీసుకెళ్లలేదు. అలాంటిది నారాయణ వైద్య కళాశాలలోని మందుల దుకాణంలో అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు అందిందంటూ భారీగా పోలీసుల్ని మోహరించి దాడులు చేశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఔషధ నియంత్రణ విభాగం ఉన్నది ప్రతిపక్షాలపై కక్ష సాధించటానికా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

పాతాళంలోకి వైసీపీ ప్రభుత్వం: వర్ల రామయ్య

ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ : కొల్లి రఘురామ్‌రెడ్డి గతేడాది మే 4 నుంచి ఔషధ నియంత్రణ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్కటైనా అంతర్‌రాష్ట్ర నకిలీ మందుల ముఠాను పట్టుకోగలిగారా? రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మాదకద్రవ్యాల తయారీ ముఠాల్ని, సరఫరాదారుల్ని, వినియోగాన్ని అడ్డుకోగలిగారా? కనీసం వారిపై దాడులైనా చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ 'లేదు' అనే సమాధానమే వస్తుంది. అలాంటి ప్రధాన విధులు, బాధ్యతల్ని విస్మరించి, ఎన్నికల ముంగిట నారాయణే లక్ష్యంగా దాడులు చేయటమేంటి?

సోదాల పేరిట భయభ్రాంతులకు గురిచేయటం, వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లేలా చేయటం, ఎన్నికలపై దృష్టి పెట్టకుండా ఇబ్బందులు కల్పించటం, తద్వారా అధికార పార్టీకి మేలు చేకూర్చటం ఈ దాడుల వెనక ప్రధాన లక్ష్యమనేది స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు, అధికార వైసీపీ ముఖ్యుల ఆదేశాల మేరకు రఘురామ్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఈ వేధింపులకు తెగబడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తోంది.

ఆ అధికారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలి- శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌

రఘురామ్‌రెడ్డికి మూడు బాధ్యతలు అందుకేనా? : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపైన కేసులు బనాయించి, వేధించటంలో సిట్‌ అధిపతిగా రఘురామ్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. 2020 ఫిబ్రవరిలో సిట్‌ ఏర్పాటైనప్పటి నుంచి టీడీపీ ముఖ్య నేతలే లక్ష్యంగా పనిచేశారు. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి, ఫైబర్‌గ్రిడ్‌, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్యుల తరఫున రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆయనే అమలు చేశారన్న తీవ్ర విమర్శలున్నాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో లోకేశ్‌ను విచారణ పేరిట వేధించారు. చివరికి ఔషధ నియంత్రణ విభాగాన్నీ కక్ష సాధింపు చర్యలకు వాడేశారు. ఐజీగా ఇటీవల పదోన్నతి పొందిన రఘురామ్‌రెడ్డి ప్రస్తుతం సిట్‌ అధిపతిగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా, ఔషధ నియంత్రణ విభాగం ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ జనరల్‌గా మూడు బాధ్యతలు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఈ పోస్టులన్నింటినీ ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకే వినియోగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆ విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు: ఎమ్మెల్యే రాచమల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.