Cricket Betting Gang Arrest : ఐపీఎల్ క్రికెట్ (IPL 2024) టోర్నీ జరుగుతున్న వేళ, దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. మూడో కంటికి తెలియకుండా పెద్దమొత్తంలో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. మియాపూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ (Cricket Betting) నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన మిషన్ భగీరథ ఏఈ - వర్క్ ఆర్డర్ల పేరుతో రూ.8 కోట్లు స్వాహా
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాతృశ్రీ నగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు, మియాపూర్ లోకల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యాప్ ద్వారా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల వద్ద నుంచి రూ.1.96 లక్షల నగదు, 4 స్మార్ట్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
IPL Betting Gang Arrest : సరిగ్గా నాలుగు రోజుల క్రితం, ఇదే మియాపూర్ మాతృశ్రీ నగర్‌లో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.43.57 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన శాకమూరి వెంకటేశ్వర్ రావు అలియాస్ (చిన్నూ)గా పోలీసులు గుర్తించారు.
బెట్టింగ్(Online Betting) అంతా కూడా క్రికెట్ లైవ్ గురు, లక్కీ ఆన్‌లైన్ యాప్, కాల్ కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. దాదాపు 50 వరకు పంటర్స్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 08 స్మార్ట్‌ఫోన్లు, 02 కీపాడ్ ఫోన్లు, 03 ల్యాప్‌టాప్‌లు, 03 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ కోసం ఉపయోగిస్తున్న అయిదు ఖాతాల్లోని 3లక్షల 57 వేల 461 రూపాయలను ఫ్రీజ్ చేసినట్లుగా తెలిపారు. సీజ్ చేసిన వాటి మొత్తం విలువ 52లక్షల 59 వేల 641 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన నేపథ్యంలో, మళ్లీ అదే ప్రాంతంలో బెట్టింగ్ ముఠా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
ఫైనాన్స్ ఏజెంట్ల నుంచి తప్పించుకోబోయి - విగతజీవిగా మారి - young man died in khammam