ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం - ఆరోగ్యానికి యోగా ఒక్కటే మార్గమంటున్న నిపుణులు - Yoga Day Celebrations in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 9:30 PM IST

International Yoga Day is Celebrated Across the State : రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజకీయ నాయకులు, అధికారులు, పౌరులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్‌ 21న జరుపుకుంటున్నారు. యోగా చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి నిరాశానిస్పృహల నుంచి బయట పడవచ్చని యోగా నిపుణులు అంటున్నారు.

International Yoga Day is Celebrated Across the State
International Yoga Day is Celebrated Across the State (ETV Bharat)

International Yoga Day is Celebrated Across the State : రాష్ట్రవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. సామాజిక, రాజకీయ నేతలతోపాటు వివిధ రంగాల ప్రముఖులు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీ యోగాను దేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపింపజేసి యోగా విశిష్టతను చాటారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మనుసులందర్ని ఏకం చేయగలిగేది యోగా మాత్రమేనని అభిప్రాయపడ్డారు.

'యోగాంధ్రప్రదేశ్​' ఘనంగా యోగా దినోత్సవం- ఆసనాలు వేసిన అధికారులు - INTERNATIONAL YOGA DAY

విజయవాడ రాజ్‌భవన్‌లో.. యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొని యోగాసనాలు వేశారు. విజయవాడలో రాష్ట్ర ఆయుష్‌ శాఖ నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ హాజరై యోగాసనాలు వేశారు.

మచిలీపట్నంలో.. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మి యోగాసనాలు వేయగా చల్లపల్లిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో చేపట్టిన యోగా సాధనల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని ఆసనాలు వేశారు. బాపట్ల జిల్లా చినగంజాంలో మహిళలు, చిన్నారులు యోగా సాధన చేశారు.

మానసిక వికాసానికి, ప్రకృతితో మమేకానికి యోగా గొప్ప సాధనం : మంత్రి సత్యకుమార్ - health minister SATYAKUMAR

తూర్పు గోదావరి జిల్లా.. రాజానగరం మండలం కానవరంలో విద్యుత్‌ దీపాలు తలపై పెట్టుకుని చిన్నారులు యోగాసనాలు వేశారు. కాకినాడలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యానాంలో చేపట్టిన యోగా దినోత్సవంలో 500 మంది పాల్గొని 24రకాల ఆసనాలు వేశారు.

కర్నూలులో.. నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని ఆసనాలు వేశారు. అనంతపురం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో జిల్లా ఎస్పీ గౌతమిశాలి, పోలీసులు యోగాసనాలు వేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కరకముక్కలలోని జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి, పోలీసులు యోగాసనాలు వేశారు.ఒంగోలులోని జిల్లా కారాగారంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ సుమిత్ సునీల్ పాల్గొని ఖైదీలతో పాటు యోగా సాధన చేశారు. ఒంగోలులోని PVR బాలికల పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు.

పార్వతీపురం మన్యం జిల్లా.. కేంద్రం ఏపీ NGO హోంలో ఆయుష్‌ శాఖ వారి ఆధ్వర్యంలో యోగాసనాలపై చిన్నారులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలో జిల్లా కలెక్టరు, ఉద్యోగులు, విద్యార్థులు కలిసి యోగాసనాలు వేశారు. అమలాపురంలోని ఓంశాంతి నిలయంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, పాఠశాల విద్యార్థులు కలిసి యోగాసనాలు చేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.

అధికారికంగా రామోజీరావు సంస్మరణ కార్యక్రమం- సీఎం చంద్రబాబు ఆదేశాలు

రాష్ట్రంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం - ఆరోగ్యానికి యోగా ఒక్కటే మార్గమంటున్న నిపుణులు (ETV Bharat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.