International Yoga Day Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాని మోదీ సైతం యోగాను దేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపింపజేసి యోగా విశిష్టతను చాటారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా మనుసులందర్ని ఏకం చేయగలిగేది యోగా మాత్రమేనని అభిప్రాయపడ్డారు.
విజయవాడ పాయకాపురం ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ప్రాంగణంలో యోగా డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత జీవన సరళిలో యోగ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని పలు రకాల రుగ్మతలను దూరం చేస్తుందని ప్రముఖులు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం యోగాతోనే సాధ్యమని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగాసనాల్లో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోజులో గంటపాటు యోగాసనాలు వేయడం వల్ల శరీరానికి అన్ని రకాల మేలు జరుగుతుందని బాపట్లజిల్లా చినగంజాం భావన్నారాయణ యోగా శిక్షణ కేంద్రం గురువు వలివేటి వెంకట రామానుజుం వివరించారు.
యోగా మనకోసం- ఆరోగ్యకరమైన మన సమాజం కోసం : గవర్నర్ - Governor in Yoga day celebrations
దైనందిన జీవితంలో యోగా భాగం కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు జిల్లా కారాగారంలో జైళ్ల శాఖ, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ఖైదీలతో కలిసి యోగాసనాలు చేశారు. కర్నూలు అవుట్ డోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని యోగాలో రాణిస్తున్న వారిని సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు.
అనంతపురంలోని పోలీసు పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. గుంతకల్లులోని రైల్వే క్రీడా మైదానంలో యోగాసనాలు వేసి విశిష్టతను వివరించారు. మెరుగైన ఆరోగ్య సమాజం కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని కోరారు. సత్యసాయి జిల్లా పోలీస్ కార్యాలయంలో యోగా గురువు తిరుమలేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పని ఒత్తిడి తగ్గాలంటే యోగా ఆవశ్యకతను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు యోగాసనాలు వేయడం వల్ల విధి నిర్వహణలో చురుకుగా పాల్గొంటారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
యోగాను గ్రామస్థాయికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉందని దీనికి ప్రభుత్వాలు ముందుకు రావాలని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన యోగా చైతన్య సంస్థ పేర్కొంది. యోగా విస్తరణకు ప్రధాని మోదీ కృషి ఎనలేనిదని కొనియాడారు. యానాంలోని డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యానాం ప్రభుత్వ ఆస్పత్రి విభాగం, పర్యాటకశాఖ అధికారుల పర్యవేక్షణలో 500మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యోగా మన దేశానికి ఆధ్యాత్మిక ఆస్తి అని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ కార్తిక్ అన్నారు. విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి, విశిష్టతను వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఏపీఎన్జీవో హోంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆరోగ్య సాధనకు యోగా సంజీవనిలా పనిచేస్తుందని ఐటీడీఏ పీవో విష్ణు చరణ్ అన్నారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిన్నారులు మహిషాసురమర్ధిని రూపకాన్ని యోగాసనాలతో వివరించారు.
34 ఏళ్లుగా ఉచితంగా శిక్షణ - అందరికీ యోగా నేర్పుతున్న పెరుమాళ్ల దత్తయ్య - Free Yoga Training