ETV Bharat / state

టోల్‌ప్లాజా నిర్వహణలో జాతీయ స్థాయిలో ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానం - వరించిన బంగారు పతకం - Indalwai Toll Plaza in Nizamabad

Indalwai Toll Plaza Got Gold Medal : రహదారుల నిర్వహణలో మెరుగుదల కోసం కేంద్రం టోల్‌ప్లాజాలకు పురస్కారాలు అందిస్తోంది. ఇందులో నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి టోల్‌ప్లాజా బంగారు పతకం సాధించింది. 'ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటనెన్స్‌-ఫ్లెక్సీబుల్‌' విభాగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడంతో ఈ అవార్డు దక్కింది. రహదారుల నిర్వహణ, రోడ్డు పక్కన, విభాగిని మధ్యలో మొక్కల పెంపకం, నిర్వహణ, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టడం వంటివి అంశాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తోంది.

Indalwai Toll Plaza
Indalwai Toll Plaza
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 10, 2024, 9:10 PM IST

Updated : Mar 10, 2024, 9:51 PM IST

జాతీయస్థాయిలో ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానం

Indalwai Toll Plaza Got Gold Medal : రహదారుల నిర్వహణలో పోటీతత్వం తీసుకొచ్చేందుకు 2018 నుంచి ఏటా కేంద్రం అవార్డులు ఇస్తోంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్దేశించిన ఆరు అంశాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులకు బంగారు, వెండి పురస్కారాలు లభిస్తాయి. 2022 ఏడాదికి గానూ ఇందల్వాయి టోల్‌ప్లాజా అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ అవార్డును గత నెల 6న దిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ప్రాజెక్టు డైరెక్టర్‌ అనిల్‌సింగ్‌ అందుకున్నారు.

Excellence in Operation and Maintenance Flexible Award : ఇందల్వాయి టోల్‌ప్లాజా (Toll Plaza) నిర్వహిస్తున్న అథాంగ్‌ కంపెనీ చేసిన మార్పులే ఈ అవార్డును తెచ్చిపెట్టాయి. రహదారి నిర్వహణతోపాటు రోడ్డు పక్కన మొక్కలు నాటడం, విభాగిని మధ్యలో మొక్కల సంరక్షణ, విద్యుద్దీపాల నిర్వహణ, రహదారిపై గుంతలు లేకుండా చూడటం, టోల్‌ప్లాజాలో నిరంతరం పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ నిర్వహించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయి. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక అత్యవసర టెలిఫోన్‌, ప్రమాదాలు పసిగట్టేందుకు రెండు రూట్లలో పెట్రోలింగ్‌ వాహనాలు, అత్యవసర అంబులెన్స్‌ అందుబాటులో ఉంచడం వంటివి ఈ టోల్‌ప్లాజా పరిధిలో నిర్వహిస్తున్నారు. వీటన్నింటికి గాను జాతీయ స్థాయి అవార్డు లభించిందని నిర్వాహకులు అంటున్నారు.

రాష్ట్రానికి మరిన్ని జాతీయ రహదారులు..!

ప్రమాదం జరిగినప్పుడు స్పందించే తీరు : నిర్వహణతో పాటు రోడ్డుపై ప్రమాదం జరిగినప్పుడు స్పందించే తీరు కూడా ఈ అవార్డు రావడానికి కారణమైంది. గతంలో ఈ రహదారిపై వాహనం బోల్తా పడితే రోజుల తరబడి అక్కడే ఉండేది. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడేది. చాలా సందర్భాల్లో ఇవి మరిన్ని ప్రమాదాలకు కారణయ్యేవి. ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు ఘటనా స్థలానికి టోల్‌ప్లాజా సిబ్బంది చేరుకోవాల్సిన గరిష్ఠ సమయానికి గరిష్ఠ ప్రతిస్పందనగా పరిగణిస్తారు.

"రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ రహదారుల నిర్వహణలో మెరుగుదల కోసం కేంద్రం టోల్‌ప్లాజాలకు పురస్కారాలు ఇస్తోంది. అందులో మా టోల్‌ప్లాజా మొదటి స్థానంలో నిలిచి స్వరం పతకం సాధించింది. రహదారి నిర్వహణతోపాటు రోడ్డు పక్కన మొక్కలు నాటడం, విభాగిని మధ్యలో మొక్కల సంరక్షణ, విద్యుద్దీపాల నిర్వహణ, రహదారిపై గుంతలు లేకుండా చూడటం, టోల్‌ప్లాజాలో నిరంతరం పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాం. వీటన్నింటికి గాను అవార్డు దక్కింది." - అనిల్‌సింగ్‌, అథాంగ్‌ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్‌, డిచ్‌పల్లి టోల్‌ ప్లాజా

Indalwai Toll Plaza in Nizamabad District : అథాంగ్‌ కంపెనీ పరిధిలోని ఇందల్వాయి టోల్‌ప్లాజా వచ్చిన తర్వాత రహదారిపై (National Highway) ఏదైనా ప్రమాదం జరిగితే కేవలం 8 నిమిషాల వ్యవధిలోనే సిబ్బంది చేరుకుని సహాయం అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారుల సంస్థ నుంచి మన్ననలు లభించాయి. ఇందుకోసం రెండు ఆంబులెన్సులు అందుబాటులో ఉండగా మరో వాహనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇలా అన్ని అంశాల్లో సమర్థ నిర్వహణకే ఈ గౌరవం దక్కినట్లు సిబ్బంది చెబుతున్నారు.

ఎన్​హెచ్​ 44పై బాంబూ క్రాష్‌ బారియర్ రెయిలింగ్‌ - తెలంగాణలో ప్రయోగాత్మకంగా తొలిసారిగా

HMDA చర్యలు.. హరితమయం దిశగా రహదారులు

Last Updated : Mar 10, 2024, 9:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.