ETV Bharat / state

పిడుగురాళ్లలో డేంజర్​బెల్స్​ - విజృంభిస్తున్న డయేరియా - Diarrhea Spreds in Paldadu District - DIARRHEA SPREDS IN PALDADU DISTRICT

Diarrhea Spreds in Paldadu District : పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా విజృంభిస్తోంది. రోజురోజుకూ వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వైద్యాధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు. ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి అతిసారం కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ ఆరుగురిని అతిసారం బలి తీసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

increasing_cases_of_diarrhea_palnadu
increasing_cases_of_diarrhea_palnadu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 11:51 AM IST

Increasing Cases of Diarrhea Palnadu District : పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వారం రోజులుగా డయేరియా విజృంభిస్తోంది. రోజురోజుకూ వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో జిల్లా వైద్యాధికారులు నివారణ చర్యలపై దృష్టి సారించారు. స్థానికంగా వైద్యం అందించడంతోపాటు మెరుగైన ఆరోగ్యం కోసం బాధితులను నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించి అతిసారం కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని లెనిన్ నగర్, మారుతీనగర్‌లో నివసించే ప్రజల్లో చాలా మంది వాంతులు, విరేచనాలతో సతమతమవుతున్నారు. మూడో తేదీ నుంచి ఇప్పటివరకూ రోజుకు 15 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు 150 మంది అతిసారంతో ఆసుపత్రుల్లో చేరారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ డయేరియా కేసులు వస్తూనే ఉండటం స్థానికులను కలవరపాటుకు గురి చేస్తోంది.

కుళాయి నీటిలోకి డ్రైనేజీ మురికి నీరు కలవడం వల్లనే అతిసారం వ్యాప్తికి కారణమైందని వైద్యాధికారులు పరీక్షలు ద్వారా గుర్తించారు. మరోవైపు డ్రైనేజీ కాలువలు అధ్వానంగా ఉండటంతో పారిశుద్ధ్యం సమస్య కూడా డయేరియా వ్యాప్తికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.' -రవితేజ, పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రి వైద్యుడు.ఆర్డీవో రమణకాంత్ రెడ్డి.

డయేరియాతో ఇద్దరు మృతి- మరో ఐదుగురి పరిస్థితి విషమం - 2 Died in Tirupati with diarrhea

Diarrhea Spreds in Paldadu District : కలెక్టర్ అరుణ్ బాబు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆర్డీవో, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక వైద్య శిబిరంలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డయేరియా కేసులపై సమీక్ష నిర్వహించారు. కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే, కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. అతిసారం వ్యాధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన అతిసారంను అదుపు చేస్తామని హామీ ఇచ్చారు. 48గంటల్లో పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీవో పిడుగురాళ్లలోనే ఉంటూ మున్సిపల్, సచివాలయ సిబ్బందితో డయేరియా కట్టడికి చర్యలు చేపట్టారు.

పల్నాడు జిల్లాలో డయేరియా అలజడి- వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న రోగులు - Diarrhea Cases in Palnadu District

ఉమ్మడి అనంతపురం జిల్లాకు అస్వస్థత! - పెరుగుతున్న డయేరియా కేసులు - Diarrhea in Joint Anantapur

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.