Two IAS officers Deputation to AP 2024 : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ధ్వంసమైన ఏపీని గాడిలో పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. సుస్థిరమైన నిర్ణయాలతో మంచి పాలన అందించే సమర్థులైన అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలో సమర్థులైన అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్‌కు రప్పిస్తున్నారు.
IAS Krishna Teja Deputation in AP : ఇందులో భాగంగా కేరళ కేడర్‌కు చెందిన మైలవరపు కృష్ణతేజ డిప్యూటేషన్‌పై ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్‌గా పని చేస్తున్న ఆయన, మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో పని చేసేందుకు డిప్యూటేషన్‌కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
సమర్థతో అంతర్జాతీయ, జాతీయ అవార్డులు అందుకున్న కృష్ణతేజ : అంతకుముందు కృష్ణతేజ కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా, ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్‌గా, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. తమ సమర్థతతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 2 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు అందుకున్నారు. 1988లో జన్మించిన కృష్ణతేజ 2015 జూన్ 16న ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. ఏపీకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఓఎస్డీగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో కృష్ణతేజ బాధ్యతలు నిర్వహించనున్నారు.
IAS Rajamouli Deputation in AP : మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న రాజమౌళి కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. యూపీలో తాజ్ కారిడార్ ఎక్స్‌ప్రెస్ వే రూపకర్తగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
ఏపీలో సుస్థిర పాలనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం (జులై 11న) భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ చేసింది. 19 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితులయ్యారు.