ETV Bharat / state

"చార్మినార్​ కూల్చివేతకు సిబ్బంది, యంత్రాలు అడిగితే ఇస్తారా?" - Hydra case in highcourt - HYDRA CASE IN HIGHCOURT

Hydra case in highcourt : హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా అసలు లక్ష్యాలను వదిలేసిందని, ఇదే వైఖరి కొనసాగితే ఏర్పాటుపై స్టే ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగానథ్‌ వర్చువల్‌గా హాజరు కాగా, అమీన్‌పూర్‌ తహసీల్దార్ నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.

hydra_case_in_highcourt
hydra_case_in_highcourt (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 2:38 PM IST

Hydra case in highcourt : నిర్మాణాల కూల్చివేతలు శని, ఆదివారాల్లో ఎందుకు చేపడుతున్నారని తెలంగాణ హైకోర్టు హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేతలపై సోమవారం జరిగిన విచారణకు హైడ్రా కమిషనర్‌ రంగానథ్‌ వర్చువల్‌గా హాజరు కాగా, అమీన్‌పూర్‌ తహసీల్దార్ నేరుగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. భవనాలు, ఇతర నిర్మాణాల కూల్చివేతలు శని, ఆదివారాలు, సూర్యాస్తమయం వేళల్లోనే ఎందుకు చేపడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆదివారం మీరు ఎందుకు పని చేయాలని ప్రశ్నించిన న్యాయమూర్తి సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరంగా కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేస్తూ కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్‌ను ప్రశ్నించింది. గతంలో మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా? అని అడుగుతూ చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించింది.

'హైడ్రా అంటే భరోసా, బాధ్యత - ఇప్పుడు కాకపోతే చెరువులను ఎప్పటికీ కాపాడుకోలేం' - Musi River Front Development

రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని న్యాయస్థానం హైడ్రాకు సూచించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి అవకాశం ఏమైనా ఇచ్చారా? ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయక ప్రజలను ఇబ్బంది పెడతారా ? అని ఉన్నత న్యాయస్థానం హైడ్రా కమిషనర్ రంగనాథ్​ను ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని సూచించింది. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బందిని కోరడంతో సమకూర్చామని రంగనాథ్ బదులివ్వగా.. చార్మినార్‌ కూల్చివేతకు తహసీల్దార్‌ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైడ్రా తీరు మారకుంటే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందన్న హైకోర్టు.. రాజకీయ నేతలను, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు అని స్పష్టం చేసింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా? అని నిలదీసింది. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా? చట్టవ్యతిరేకంగా పనిచేస్తే అధికారులు ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.

మూసీ పరీవాహక ప్రాంతంపై కూడా 20 లంచ్‌ మోషన్‌ పిటిషన్లు దాఖలైనందున అరుదైన కేసుగా భావించి అధికారులను విచారణకు పిలిచాం అని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం హైడ్రాకు ఎన్నో విధులున్నా అవేమీ పట్టించుకోకుండా కూల్చివేతలపైనే ఎందుకు దృష్టి పెట్టారని ప్రశ్నించింది. ట్రాఫిక్‌ సమస్యపైనా హైడ్రాకు బాధ్యత ఉందని గుర్తు చేస్తూ దాని గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు. మాదాపూర్‌లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా? చట్టానికి లోబడి వ్యవహరించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది.

సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేస్తేనే సామాన్యులు ఇళ్లు నిర్మిస్తున్నారు కదా.. స్థానిక సంస్థ అనుమతి ఇస్తేనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నార కదా.. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవాల్సి వస్తోందని స్పష్టం చేసింది. ఆదివారం కూల్చివేతలు వద్దని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఉందని, ఒకవేళ అక్రమం అనిపిస్తే సీజ్‌ చేయవచ్చు కదా? అని న్యాయమూర్తి పేర్కొన్నారు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే కానీ, పనితీరే అభ్యంతరకరం అని అన్నారు. అమీన్‌పూర్‌ తహసీల్దార్‌, హైడ్రా కమిషనర్‌ తీరు అసంతృప్తికరం అని తెలిపారు. ఒక్కరోజులో హైదరాబాద్‌ను మార్చాలనుకోవడం సరికాదన్న న్యాయస్థానం... ఎఫ్​టీఎల్​ (FTL) నిర్ధరించకుండా అక్రమాలు అని ఎలా తేలుస్తారు?’ అని ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేస్తూ అప్పటివరకు యథాస్థితి కొనసాగించాలని హైడ్రా, అమీన్‌ఫూర్‌ తహసీల్దార్‌ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని సూచించింది.

అనాలోచిత నిర్ణయాలతో సీఎం రేవంత్​ పాలన - హైడ్రా బాధితులకు అండగా ఉంటాం: హరీష్​రావు - HARISH RAO MEET HYDRA VICTIMS

చెరువులో భవనం - బాంబులతో కూల్చేసిన అధికారులు - వీడియో వైరల్​ - Illegal Construction Demolition

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.