ETV Bharat / state

'మొక్కలు పెంచడమంటే నాకు ప్రాణం - ఆ ఆలోచనే నన్ను సేంద్రీయ వ్యవసాయంవైపు అడుగులు వేయించింది' - hyderabad women organic farming

Hyderabad Woman Anitha Grows Organic Vegetables : పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, తినే తిండి కలుషితం బతుకంతా కలుషితం. చుట్టూ పరిశ్రమలు, వాహనాలు అవి వదిలే పొగ కారణంగా కాలుష్యంతో జీవనం చేయక తప్పని పరిస్థితి ప్రస్తుతం మనుషులది. అయితే ఈ పరిస్థితిని కొంతైనా నివారించాలని భావించారు ఓ మహిళ. పూర్తి సేంద్రీయ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. మొక్కలు, చెట్లతో స్నేహం చేస్తూ ప్రకృతిలోని మజాను ఆస్వాదిస్తున్న ఆ మహిళ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.

Organic Vegetables
Hyderabad Woman Anitha Grows Organic Vegetables
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 1:33 PM IST

కాలుష్యం ఆమె ఆలోచనని మార్చింది సేంద్రియ వ్యవసాయంవైపు అడుగులు వేయించింది

Hyderabad Woman Anitha Grows Organic Vegetables : జనాభా అంతకంతకూ పెరుగుతోంది. ఆ జనాభా అవసరాలకు అనుగుణంగా వాహనాలు పెరుగుతున్నాయి, పరిశ్రమలు విస్తరిస్తున్నాయి. దానితో పాటే కాలుష్యం కూడా పెరిగిపోతోంది. ఆ ప్రభావం అన్నింటిపైనా పడుతోంది. మనుషుల ఆరోగ్యానికి ఆ కాలుష్యం ఎసరు పెడుతోంది. ఈ కాలుష్యం మాట అలా ఉంటే పండించే పంటలు సైతం రసాయనాల కారణంగా కలుషితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని కొంతైనా నివారించాలని భావించారు హైదరాబాద్ మహిళ అనిత. పాలీ హౌస్​ను లీజుకు తీసుకుని అందులో సేంద్రీయ పద్ధతుల్లోకూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల సాగు చేస్తున్నారు.

అనిత డిప్లొమా పూర్తి చేసి కొన్నాళ్లు ఓ ఎలక్రానిక్స్ సంస్థలో ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచి మెుక్కలు, పర్యావరణ పరిరక్షణ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆ ఆసక్తితోనే ఇంటి పిట్టగోడ మీద చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసుకుని మొక్కలు పెంచేవారు. కొన్నాళ్ల తర్వాత వివాహం కాగా, భర్త, అత్తింటి వారికి కూడా మెుక్కలు, చెట్ల పెంపకంపై అభిరుచి ఉండటంతో అనిత మిద్దె సాగు ప్రారంభించారు. అయితే తాము అనుకున్న రితీలో మెుక్కలు పెంచలేకపోతున్నామని వారికి ఎక్కడో వెలితి ఉండేది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్మండలం ఖైతాపూర్లో అయిదెకరాల పాలీహౌస్ను లీజుకు తీసుకుని సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు.

వంటకాలతో ఉపాధి.. కొత్తకోట నారీమణుల ఐడియా అదుర్స్!

Organic Cultivation Uses In Telugu : మిద్దెసాగు సమయంలో అనిత ట్టుపక్కల ఉన్న అయిదారు కుటుంబాల వారికి రసాయన రహిత కూరగాయలను అందించే వారు. ఇప్పుడు పాలీ హౌస్లో సాగైన కూరగాయలను వివిధ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు.బయట పొలాల్లో పండించే పంటకు పాలీహౌస్లో పండించే పంటకు ధరల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సేంద్రీయ పద్ధతుల్లో పండించే పంటలు కావడంతో పాలీ హౌస్కూరగాయల ధరలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇలాంటి కూరగాయల పట్ల అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో సాధారణ ధరలకే అందజేస్తున్నామని అనిత అంటున్నారు.

"నాకు చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం చాలా ఇష్టం. ఇప్పుడు అందరూ రసాయనాలు వేసి మొక్కలు పెంచుతున్నారు. నేను ఎందుకు సేంద్రీయంగా కూరగాయలు పెంచకూడదు అనుకుని మొదలు పెట్టాను. ఇప్పుడు చాలా బాగుంది. ఔషధ మొక్కలు అందించేందుకు నర్సరీని మొదలుపెట్టాలి అనుకుంటున్నాం. సేంద్రీయ వ్యవసాయంపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాను." - అనిత, పాలిహౌజ్ వ్యవస్థాపకురాలు.

చౌటుప్పల్, బోయిన్పల్లి, మూసాపేట మార్కెట్లకూ, వివిధ కాలనీలకూ ఈ ధరలకే అందిస్తున్నామని చెబుతున్నారు. తమ పాలీహౌస్లో పండించే కూరగాయలు ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయని వెల్లడించారు. పరిశ్రుభ్రమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కోసం ప్రారంభించిన పాలీహౌస్ మంచి లాభాలను ఇస్తోందని అంటున్నారు అనిత. దీంతో పాటు 12 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అనిత చెబుతున్నారు.

తండ్రి కలను నిజం చేసేందుకు సివిల్స్ సాధించా : ఐపీఎస్ మౌనిక

మెుక్కలు, చెట్లతో స్నేహం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అనిత అంటున్నారు. మట్టి స్వభావాన్ని పరిశీలించి వాటికి కావాల్సినవి అందచేస్తే నేల సారవంతంగా ఉంటుందన్నారు. చెట్లు, మెుక్కలకి కూడా ఫీలింగ్స్ఉంటాయని సంగీతానికి కూడా అవి స్పందిస్తాయని చెబుతున్నారు. మనుషులతో పాటు చెట్లతో స్నేహంగా చేయాలని అంటున్నారు. ప్రకృతితో మమేకమైతే ఆ మజాయే వేరని అంటున్నారు అనిత.

రాబోయే తరాల వారికి భూమి లేకుండా పోయే ప్రమాదం ఉందని దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఏంతైన ఉందని అనిత అంటున్నారు. పంటలు వేయకుండా భూములు ఖాళీగా ఉంచరాదని, ఏదో ఒక పంటను పండించాలని హితవు పలుకుతున్నారు. అది కూడా సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచిస్తున్నారు. తద్వారా రాబోయే తరాల వారికి మంచి ఆహరం అందించే అవకాశం ఉంటుందన్నారు ఆమె.

వ్యవసాయ కుటుంబం నుంచి ఫ్లైటెక్ ఏవియేషన్‌ సంస్థలో పైలట్‌గా మెళకువలు

ప్రస్తుతం తమ వ్యవసాయ ప్రయాణం పాలీహౌస్తోనే ఆగిపోదని, రాబోయే రోజుల్లో నర్సరీని సైతం ప్రారంభిస్తామని అంటున్నారు అనిత. ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతామని త్వరలో నర్సరీని ప్రారంభించి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. పాఠశాల విద్యార్థులకు చెట్లు పెంచడం వాటితో స్నేహం చేయడంపై అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. వ్యవసాయంలో సరికొత్త ఫలితాలు సాధిస్తున్న అనిత సాటి మహిళలతో పాటు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తన మార్గాన్ని అందరూ ఆచరించాలని హితవు పలుకుతున్నారు.

సజీవ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ @ఫొటోగ్రాఫర్‌ శ్రవణ్ - కెమెరా క్లిక్‌మందంటే అవార్డు పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.