ETV Bharat / state

హైదరాబాద్ లాడ్‌బజార్‌ లక్క గాజుల​కు జీఐ గుర్తింపు - తెలంగాణ నుంచి 17వ ఉత్పత్తి

Hyderabad Lac Bangles GI Tag : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు(జీఐ) లభించింది. ఇది వరకే మహానగరంలోని హలీమ్‌కు జీఐ ట్యాగ్‌ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి.

Hyderabad_Lac_Bangles_GI_Tag
Hyderabad_Lac_Bangles_GI_Tag
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 2:22 PM IST

Hyderabad Lac Bangles GI Tag : హైదరాబాద్​లోని పాతబస్తీ​ లక్కగాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని కంట్రోలర్​ జనరల్​ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్​మార్క్స్​ గుర్తింపును మంజూరు చేసింది.​ ఇదివరకే హైదరాబాద్‌ హలీమ్‌కు(Hyderabad Halim) జీఐ ట్యాగ్‌ దక్కగా, తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌ లాడ్‌బజార్‌ లాక్‌ బేంగిల్స్​ను (Laad Bazaar Lac Bangles) తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని సెంట్రల్ గవర్నమెంట్ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను ప్రకటించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో జీఐ ట్యాగ్‌ అందుకున్న 17వ ఉత్పత్తిగా ఇది చోటు దక్కించుకుంది.

Hyderabad Lac Bangles Geographical Indication : హైదరాబాద్‌ నగరంలో పాతబస్తీ గాజులకు ప్రసిద్ధి. ఇక్కడ వివిధ రకాల గాజులు తయారవుతుంటాయి. అందులో లక్క రాళ్ల గాజులు స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లో(International Market) బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ గాజుల తయారీ ప్రక్రియ ఎంతో క్లిష్టమైనది. రెసిన్‌ పదార్ధాన్ని కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. దీన్ని వృత్తాకారంలో మలిచి, దానిపై రాళ్లు, పూసలు, స్ఫటికాలు, అద్దాలను హస్తకళాకారులు అందంగా చేతులతోనే పొదుగుతారు.

మగువలు మెచ్చే.. వన్నెతగ్గని 'లక్కగాజులు'

కాలక్రమేణా వీటి డిజైన్లలో ఎన్నో మార్పులొచ్చాయి. మొఘల్ వంశస్థుల కాలంలో ఈ కళ ఉద్భవించిందని చెబుతారు. రాజకుటుంబాల్లోని మహిళలు ఈ గాజులను విరివిగా ధరించేవారు. ఇప్పుడు వేడుకల్లో వీటిని ధరించడానికి స్త్రీలు ఇష్టపడుతున్నారు. లాడ్‌ బజార్‌లో మాత్రమే దొరికే ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు(Geographical Indication) కోసం 2022లో క్రిసెంట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఆర్టిజన్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ అప్లికేషన్ చేసింది. దీనికి తోడుగా తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ సహకారాలు అందించింది.

Hyderabad Laad Bazaar Bangles : ఈ నేపథ్యంలో 18 నెలల పరిశీలన తరవాత జీఐ ట్యాగ్‌ మంజూరైంది. త్వరలోనే ధ్రువీకరణ పత్రం రానుంది. ఇక్కడ 'లాక్‌ గాజుల తయారీపై 6 వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఈ జీఐ ట్యాగ్ రావటంతో ఇకపై వీరందరికీ గుర్తింపు, గౌరవం వస్తుంది. అంతేకాకుండా మున్ముందు మంచి డిజైన్‌లను(Bangles Designs) రూపొందించడానికి, కొత్తవి తయారు చేసేందుకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మార్కెట్లో ఈ లక్క గాజులకు మంచి డిమాండ్‌తో పాటు అమ్మకాలు పెరిగి హస్తకళాకారుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది' అని ఆర్టిజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ హిసాముద్దీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

మగువల మనసు దోచే గాజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.