AP Crime News : తాకట్టు పెట్టిన బంగారం భార్య అడుగుతుందని భర్త ఆమెకు మత్తు మందు ఇచ్చి, నిప్పంటించి హత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన ఏపీలోని విశాఖ పట్టణం జిల్లా మురళీనగర్‌లో చోటుచేసుకుంది. సిలిండర్ ప్రమాదమని చుట్టుపక్కల వాళ్లను నమ్మించే ప్రయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న భార్య నిజం చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్టణంలోని మురళీనగర్ సింగరాయ కొండపై వెంకటరమణ, కృష్ణవేణి దంపతులు ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు. వారికి కుమారుడు, కుమార్తె. భర్త వెంకటరమణకు మద్యం వ్యసనం ఉండటంతో పాటు భారీగా అప్పులు ఉన్నాయి. దీంతో భార్య వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాడు. బంగారం విడిపించమని భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఈ క్రమంలో నవంబరు 23న పాప మొదటి పుట్టిన రోజు నాటికి బంగారాన్ని విడిపించాలని వెంకట రమణ భార్య తల్లిదండ్రులు చెప్పారు. దీంతో వెంకటరమణ భార్యను శాశ్వతంగా లేకుండా చేస్తే ఈ బాధ తప్పుతుందని భావించి, ఆమెను కడతేర్చడానికి ప్లాన్ వేసుకున్నాడు. నవంబరు 16వ తేదీన రాత్రి వెంకటరమణ మద్యం తాగి తనతో పాటు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చాడు. ఆ కూల్‌డ్రింక్‌ను భార్యకు ఇచ్చాడు. ఆమె అది తాగగానే కళ్లు తిరిగి తూలుతున్నప్పుడే గ్యాస్‌స్టవ్ వద్దకు తీసుకెళ్లాడు. దుస్తులపై మంటలు అంటుకునే పొడి చల్లి, స్టవ్ వెలిగిస్తున్నానంటూ అగ్గిపుల్లను గీసి ఆమె దుస్తులపై వేశాడు.
కోలుకున్న భార్య - అరెస్టు అయిన భర్త : కళ్లెదుటే భార్య కాలిపోతున్నా, భర్త తలుపు తీయకుండా అక్కడే చూస్తూ ఉన్నాడు. ఆమెకు మత్తు ప్రభావం వదిలిన తర్వాత శరీరం కాలడంతో గట్టిగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి కృష్ణవేణిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించిన తర్వాత కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఆమె గొంతు వద్ద బాగా కాలిపోవడంతో శనివారం వరకు ఆమె మాట్లాడకుండా బెడ్‌పైనే ఉండిపోయింది. ఆ తర్వాత కోలుకున్న బాధితురాలు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంకట రమణపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
భార్యపై అనుమానంతో హత్య - ఆపై అగ్నిప్రమాదంగా చిత్రీకరించిన భర్త
ఒకే ఇంట్లో ఇల్లాలు, ప్రియురాలు - ఆరేళ్లుగా అంతా సాఫీగా - ఆ ఒక్క కారణంతో?