ETV Bharat / state

కళతప్పిన నగరవనాలకు పర్యాటక శోభ - NAGARAVANAM PARK GUNTUR PERECHERLA

పేరేచర్ల నగరవనానికి పూర్వ వైభవం- ఉపముఖ్యమంత్రి పవన్‌ సూచనలతో అభివృద్ధిపై దృష్టి

huge_visitors_to_nagaravanam_park_guntur_perecherla
huge_visitors_to_nagaravanam_park_guntur_perecherla (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 8:07 AM IST

Huge Visitors to Nagaravanam Park Guntur Perecherla : కనుచూపు మేర పచ్చదనం, అడవిని తలపించే పరిసరాలు, ఆహ్లాదపరిచే చల్లని గాలులు.. కాంక్రీట్‌ జంగిల్‌లాంటి నగరాల్లో ఆట విడుపుగా మారిన నగరవనాల ప్రత్యేకతలివి. వైఎస్సార్సీపీ హయాంలో నిరాదరణకు గురైన ఈ వనాలు ఇప్పుడు మళ్లీ సందర్శకుల్ని ఆకర్షిస్తున్నాయి. వినోద, సాహస కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి.

గుంటూరు శివారులోని పేరేచర్ల వద్ద గత టీడీపీ ప్రభుత్వంలో నగరవనం ఏర్పాటైంది. 210 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు. చుట్టూ కొండలు, పచ్చదనంతో మరింత ఆహ్లాదకరంగా మారింది. అప్పట్లో సందర్శకులతో కళకళలాడేది. వైఎస్సార్సీపీ హయాంలో నగరవనం కళ తప్పింది. కనీస నిర్వహణ లేక పరికరాలు, పిల్లల ఆట సామగ్రి మూలకు చేరాయి. సందర్శకుల రాక కూడా తగ్గింది. కూటమి ప్రభుత్వం నగరవనానికి మళ్లీ పూర్వవైభవం తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నగరవన యోజన పథకం కింద పేరేచర్ల నగరవనాన్ని ఆధునీకరిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో కలిసి విజ్ఞాన, వినోద కేంద్రంగానూ తీర్చిదిద్దారు.

'నగరవనం'లోకి ప్రవేశం లేదా? - మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలు

' ఇక్కడ ఎర్రచందనం వనాన్ని 20 సంవత్సరాలుగా పెంచాము. విద్యార్థుల కోసం అన్ని రకాల జంతువులను ఇక్కడ చూపిస్తున్నాం. ప్రతీ దాని గురించి వివరాలతో బోర్డు పెట్టాము. లోటస్​ పాండ్​, ఇంటర్​ప్రిటేశన్​ సెంటర్​ చాలా బాగున్నాయని పర్యటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెయ్యికి పైగా చెట్లు ఉన్నాయి. కుటుంబంతో వనభోజనాలకు ఇక్కడికి వచ్చే సదుపాయం కలిగిస్తున్నాం.'-పోతురాజు, అటవీశాఖ అధికారి

విజయ్‌, వాహనాల నిర్వాహకుడు

'ఇక్కడ వెయ్యికి పైగా చెట్లు ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సెలవు రోజుల్లో మంచి విశ్రాంతి దొరికినట్టుంది. కేవలం ప్రశాంతమైన పరిసరాలే కాకుండా, విద్యార్థులకు కొత్త విషయాలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లలైతే చక్కగా ఆడుకోవచ్చు.' - పర్యటకులు

Nagaravanam: డోన్‌ సమీపంలో నగరవనం.. వేగంగా పనులు!

నగరవనంలో 6 కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. కొండ ఎక్కేందుకు ట్రెక్కింగ్‌ సౌకర్యం యువతను, ఆట వస్తువులు, జంతువుల బొమ్మలు పిల్లలను ఆకర్షిస్తున్నాయి. సందర్శకుల్లో సంతృప్తి కనిపిస్తోంది. నగరవనాల అభివృద్ధిపై దృష్టిసారించాలన్న ఉపముఖ్యమంత్రి పవన్‌ సూచనలతో దీన్ని అధికారులు మరింతగా ఆధునీకరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.