ETV Bharat / state

తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం - Tidco Houses in AP

HUDCO Agreed Give Loan Construction of Tidco Houses in AP : ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకొచ్చింది.

తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం
తొలగిపోతున్న అడ్డంకులు - టిడ్కో ఇళ్లకు హడ్కో రుణం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 7:50 AM IST

Updated : Jul 8, 2024, 9:09 AM IST

HUDCO Agreed Give Loan Construction of Tidco Houses in AP : టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టి నెల రోజులు అవ్వకముందే టిడ్కో ఇళ్ల విషయంలో కీలక ముందడుగు పడింది.రూ. 2 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ముందుకు వచ్చింది.

అప్పట్లో రుణమిచ్చేందుకు ససేమిరా : టిడ్కో ఇళ్ల నిర్మాణానికి హడ్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు. కానీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు. బ్యాంకులూ వెనకడుగు వేశాయి. ప్రభుత్వమూ నిధులు కేటాయించలేదు. దీనికి జగన్‌ అనుసరించిన విధానాలే కారణం. ఫలితంగా 2 లక్షల 62 వేల గృహాలను పూర్తిచేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి లక్షా 45 వేల ఇళ్లనే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించారు. వీటిలోనూ 90% పైగా 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలావరకు పూర్తయినవే. టీడీపీ కట్టిన ఇళ్లకే వైఎస్సార్సీపీ రంగులేసి అప్పగించారు.

మంత్రి గారి శ్రమదానం- స్వయంగా కొడవలి చేతబట్టి పిచ్చి మొక్కల తొలగింపు - YCP Fraud In Tidco Houses

వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లపై రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం, తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్లిస్తోందనే భావనతో అప్పట్లో రుణాలిచ్చేందుకు హడ్కో, బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపలేదు. రుణానికి గ్యారంటీ ఇస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. రూ. 2 వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు సమ్మతించింది. దీంతో టిడ్కో ఇళ్లకు ఇక మంచి రోజులు రానున్నాయి.

గుడివాడలో వైఎస్సార్సీపీ అక్రమాలు - టిడ్కో ఇళ్ల పేరుతో భారీగా దోపిడీ - Irregularities in Amrit Scheme

మొత్తం పూర్తికి రూ.5 వేల కోట్లు అవసరం : రాష్ట్రంలో లక్షా 17 వేల టిడ్కో గృహాల్ని నిర్మించాల్సి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు రూ. 5 వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు రూ. 1300 కోట్లు ఉన్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సినది రూ.1500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం అనుమతి రాగానే నిర్మాణాలు జోరుందుకోనున్నాయి.

కాంట్రాక్టర్లుకు రూ. 473 కోట్లు పెండింగ్​ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తిచేయకపోగా గుత్తేదారులకు బిల్లులూ చెల్లించలేదు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు కట్టినవారికి ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి దాదాపు రూ. 473 కోట్ల వరకు ఉన్నట్టు తెలిసింది. వీరంతా కొత్త ప్రభుత్వమే ఆదుకుంటుందన్న ఆశతో ఉన్నారు.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో టిడ్కో లబ్ధిదారుల అవస్థలు - చంద్రబాబు రాకతో చిగురించిన ఆశ - Plight of TIDCO Beneficiaries

Last Updated : Jul 8, 2024, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.