How to download your voter slip online: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధమయ్యారా? ఇంకా మీకు ఓటర్ స్లిప్ అందలేదా.? ఎవ్వరినీ అడగ కుండా మీ ఓటర్ స్లిప్ (Voter Slip Download) మీ మెుబైల్, కంప్యూటర్లో డౌడ్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? తెలియక పోతే, ఈ వార్త మీకోసమే, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవసరమైన ఓటర్ స్లిప్‌ను మీ కంప్యూటర్ లేదా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో మీ ఫోన్‌నే కింద చెప్పిన విధంగా ఫాలో అయి ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
వెబ్‌సైట్ ద్వారా ఇలా..

- ఓటర్ స్లిప్ కోసం కంప్యూటర్ లేదా మొబైల్ బ్రౌజర్‌లో ఈ లింక్ క్లిక్ చేయండి. ఇందులో 3 ఆప్షన్లు కనిపిస్తాయి.
- ఓటరు ఐడీ, మొబైల్ నెంబరు, మీ పేరు - ప్రాంతం తదితర వివరాలతో ఓటర్ సమాచారం వెతకొచ్చు.
- Search by Mobile ఆప్షన్‌లో ఓటరు ఐడీకి అనుసంధానించిన మొబైల్ నెంబరు - ఓటీపీతో లాగిన్ అయ్యి.. ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
- Search by Details ఆప్షన్‌లో మీ పేరు, వయసు, నియోజకవర్గం, జిల్లా తదితర సమాచారం ఇచ్చి సమాచారం వెతకొచ్చు.
- Search by EPIC ఆప్షన్‌లో ఓటర్ ఐడీని ఎంటర్ చేసి ఓటరు సమాచారం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఆ సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని ఓటు హక్కు ఉపయోగించుకోవచ్చు. అందులోనే మీ పోలింగ్ బూత్ వివరాలు కూడా ఉంటాయి.
యాప్‌లో ఎలా అంటే?

- ఓటర్ కార్డు వివరాలు తెలుసుకునేందుకు ఉన్న మరో అవకాశం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ (Voter Helpline App). యాప్ డౌన్‌లోడ్: ఆండ్రాయిడ్, యాపిల్
- యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అందులోని ఎలక్టోరల్ రోల్ సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేసి ఓటర్ స్లిప్ పొందొచ్చు.
- ఇందులో మొబైల్ నెంబరు, ఓటరు ఐడీ, మీ వివరాల సెర్చ్ ఆప్షన్‌తోపాటు క్యూఆర్ కోడ్ స్కాన్ ఆప్షన్ అదనంగా ఉంటుంది.
- ఓటర్ ఐడీ మీద క్యూఆర్ కోడ్‌ను ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా స్కాన్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం వస్తుంది.
- అలా వచ్చిన సమాచారాన్ని వాట్సప్, మెయిల్ ద్వారా షేర్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని ఓటు హక్కు కోసం వాడొచ్చు.
మొబైల్‌లో మెసేజ్ చేసి...

ఎస్ఎంఎస్ ద్వారా: మెసేజ్ ద్వారా కూడా ఓటరు సమాచారాన్ని పొందొచ్చు. దీని కోసం 1950 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఓటరు ఐడి టైప్ చేసి మెసేజ్ సెండ్ చేయాలి. కాసేపటికి మీకు పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు లాంటి సమాచారం మొబైల్‌కి మెసేజ్ రూపంలో వస్తుంది.