ETV Bharat / state

ఏపీ నుంచి స్విగ్గీ బహిష్కరణ - అభ్యంతరాలకు జొమాటో "ఓకే" - Swiggy Boycott in Andhra Pradesh

స్విగ్గీకి ఈనెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేత

Swiggy_Boycott_in_Andhra_Pradesh
Swiggy Boycott in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 5:10 PM IST

Updated : Oct 4, 2024, 8:10 PM IST

Swiggy Boycott in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందిపెడుతున్న స్విగ్గీపై హోటల్‌, రెస్టారెంట్‌ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు స్విగ్గీకి ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని హోటల్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది. స్విగ్గీ, జొమాటో వల్ల హోటళ్లు, రెస్టరంట్లకు నష్టం జరుగుతోందని హోటల్‌ అసోసియేషన్ పేర్కొంది. స్విగ్గీ, జొమాటో సంస్థల యాజమాన్యాలతో గతంలో చర్చలు జరిపామని, తమ అభ్యంతరాలను జొమాటో మాత్రమే అంగీకరించిందని హోటల్ అసోసియేషన్ తెలిపింది.

విజయవాడలో ఏపీ హోటల్‌ అసోసియేషన్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.వి.స్వామి, విజయవాడ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమణరావు నేతృత్వంలో అన్ని జిల్లాల అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా స్విగ్గీ, జొమాటో ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌, డెలివరీ సంస్థలతో చర్చించామని తెలిపారు.

తమకు ఇవ్వాల్సిన కమిషన్‌ విషయంలో ఈ సంస్థలు అనేక నిబంధనలు విధిస్తున్నారని, వీటివల్ల హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని విమర్శించారు. తమకు తెలియకుండానే కాంబో ప్యాకేజీల పేరిట ఆర్డర్లు బుక్‌ చేస్తున్నారని, వాటికి అయ్యే ఖర్చులు, పన్నులను సైతం తమపైనే వేస్తున్నారని అన్నారు. జొమాటో సంస్థ కొంత వరకు తమ అభ్యంతరాల పరిష్కారానికి ఆసక్తి చూపిందని, కానీ స్విగ్గీ సంస్థ వాయిదా వేస్తూ కాలయాపన చేయడం వల్ల అనివార్య పరిస్థితుల్లో బాయ్‌కాట్‌ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థలతో వ్యాపారం కొనసాగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ వారు అనుసరిస్తోన్న నియమ నిబంధనల్లో తగిన మార్పులు చేసేందుకు సమ్మతిస్తే అప్పుడు తమ నిర్ణయాన్ని పునరాలోచన చేస్తామన్నారు. ఈనెల 14 నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో స్విగ్గీ ఆర్డర్లు తీసుకోబోమని ప్రకటించారు.

"చాలా రోజుల నుంచి హోటల్ ఇండస్ట్రీ రెస్టారెంట్ల విషయంలో చాలా ఇబ్బందులు పడుతోంది. స్విగ్గీ అవలంబిస్తున్న విధానం వలన యాజమాన్యాలు భారీగా నష్టపోతున్నాయి. ఈ విషయంపై స్విగ్గీ, జొమాటో వారితో చర్చించడం జరిగింది. నెలన్నర రోజులు వారికి టైమ్ ఇవ్వడం జరిగింది. చాలా వరకూ మా అభ్యంతరాలను జొమాటో అంగీకరించింది. కానీ స్విగ్గీ వారు కాలయాపన చేస్తున్నారు". - ఆర్.వి. స్వామి, హోటల్స్ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

ఆ రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు- స్విగ్గీ ప్రస్థానం గురించి తెలుసా? - swiggy ceo recalls APP Launch

Last Updated : Oct 4, 2024, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.