Home Minister Anita Visit Victims of Paravada Pharmacy Incident: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా ఘటన మరువక ముందే పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయవడిన వారిని హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందిని నలుగురు కార్మికులకు గాయాలయ్యాయిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందిని మంత్రి హామి ఇచ్చారు. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయిని పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలిని తెలిపారు. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఒక కమీటి వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని అన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎల్జీపాలిమర్స్ లాంటి పెద్ద ఘటన జరిగినప్పడు కనీసం అప్పటి సీఎం పరామర్శకు కూడా రాలేదని మంత్రి అనిత విమర్శించారు.
అనకాపల్లి జిల్లాలో మరో 'ఫార్మా' ప్రమాదం - నలుగురు కార్మికులకు గాయాలు - Parawada Pharma City Incident
Parawada Pharma City Incident: పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి ఘటన జరిగింది. రసాయనాలు కలుపుతుండగా జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన కార్మికులు ఝార్ఖండ్‌కు చెందినవారిగా గుర్తించారు.
ఛార్జింగ్ చేస్తుండగా ప్రమాదం: 6 కిలోలీటర్ల రియాక్టర్‌లో కెమికల్ నింపి ఛార్జింగ్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్‌హోల్ నుంచి రసాయనం ఉప్పొంగి పైకప్పుకు తగిలి కార్మికులపై పడింది. దీంతో గాయపడిన కార్మికులను హుటాహుటిన విశాఖలోని ఇండస్ ఆస్పత్రికి తరలించారు. జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్, కోహర్, రోసకు గాయాలు అయ్యాయి. వీరితో పాటు విజయనగరానికి చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ గాయపడ్డారు.
ఆందోళన రేపుతున్న ఫార్మా ప్రమాదాలు - భయాందోళనల్లో కార్మికులు - Atchutapuram Pharma incident
అచ్యుతాపురం ఫార్మా ఘటన - ప్రమాదం వెనుక అధికారుల నిర్లక్ష్యం! - Atchutapuram SEZ Incident